news

News September 26, 2024

సూర్య, విక్రమ్, శంకర్ కాంబోలో మూవీ?

image

తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్యతో దర్శకుడు శంకర్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. వెల్పరి నవల ఆధారంగా మూవీని తీయనున్నట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇదే విషయమై హీరోలతో దర్శకుడు చర్చిస్తున్నారని సమాచారం. మూవీని 3 పార్టుల్లో తీసుకొస్తారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్ ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News September 26, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: సెప్టెంబర్ 26, గురువారం
✒నవమి: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ పునర్వసు: రాత్రి 11.33 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 10.58- 12.39 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 09.58 నుంచి 10.46 గంటల వరకు
2) మధ్యాహ్నం 2.46 నుంచి 3.35 గంటల వరకు

News September 26, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: వరద బాధితుల అకౌంట్లలో రూ.25వేల చొప్పున జమ
* అన్యమతస్థులు డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకి: మంత్రి పయ్యావుల
* ఈ నెల 27న తిరుమలకు కాలినడకన జగన్
* తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు: పేర్ని నాని
* TG: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించండి: సీఎం
* హైడ్రా వల్ల ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవట్లేదు: మల్లారెడ్డి
* నాలుగు రోజుల పోలీసు కస్టడీకి జానీ మాస్టర్

News September 26, 2024

మల్టీ బ్యాగర్ స్టాక్ కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు

image

మ‌ల్టీ బ్యాగ‌ర్ స్మాల్ క్యాప్ స్టాక్ సుద‌ర్శ‌న్ ఫార్మా షేరు బుధ‌వారం సెష‌న్‌లో 5% పెరిగి ₹424కి చేరింది. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులో జ‌రిగే సంస్థ బోర్డ్ మీటింగ్‌లో స్టాక్ స్ల్పిట్‌పై చ‌ర్చించనుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ఈ షేరు 3 నెలల్లో 416% ర్యాలీ చేయడమే దీనికి ప్రధాన కారణం. ₹10 ఫేస్ వాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను సబ్-డివిజన్/స్ప్లిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

News September 26, 2024

అద్భుతమైన ఫొటో.. విమానం నుంచి తిరుమల వ్యూ

image

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రం తిరుమల. తాజాగా ఓ యువకుడు ఫ్లైట్ నుంచి తిరుమల ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అని, కానీ అత్యాధునిక లెన్స్ ఉపయోగించి ఈ ఫొటో తీశానని Xలో పేర్కొన్నారు. కొండపై నెలవైన వెంకన్నస్వామి కొలువు ఎంత అద్భుతంగా ఉందో కదా!
PHOTO CREDITS: Prudhvi Chowdary

News September 26, 2024

తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా?

image

AP: వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాం నుంచే అన్యమతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది. వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి. 1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.

News September 26, 2024

డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ దర్శనానికి వెళ్లాలి: పురందీశ్వరి

image

AP: టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వైసీపీ చీఫ్ జగన్ వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. కాగా ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమల వెళ్లనున్నారు.

News September 26, 2024

Airtel యూజర్లకు గుడ్ న్యూస్

image

స్పామ్ కాల్స్‌, మెసేజ్‌ల క‌ట్ట‌డికి ఎయిర్‌టెల్ త‌న వినియోగ‌దారుల కోసం మొట్టమొదటి AI-పవర్డ్ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రియ‌ల్ టైంలో యూజ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు పంపేలా ఈ స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను సంస్థ తీసుకొచ్చింది. ఈ సేవ‌ల వినియోగానికి ఎలాంటి స‌ర్వీస్ రిక్వెస్టులు, యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎయిర్‌టెల్ యూజ‌ర్లంద‌రికీ ఉచితంగా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

News September 25, 2024

GREAT: రూ.6కోట్ల విలువైన భవనాన్ని దానం చేశారు!

image

AP: సమాజ హితాన్ని కోరుకుంటూ రూ.కోట్ల ఆస్తిని దానం చేసేవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. తెనాలికి చెందిన డా.ముద్దన కస్తూరిబాయి తమకు చెందిన మహిళా మండలి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. మహిళా సాధికారతను ఆకాంక్షిస్తూ ఆమె రూ.6 కోట్ల విలువ చేసే భవనాన్ని దానం చేయడం స్ఫూర్తిదాయకం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 25, 2024

‘మేకిన్ ఇండియా’పై రాహుల్ గాంధీ చురకలు

image

మేకిన్ ఇండియా పేరుతో BJP అన్ని కాంట్రాక్టుల‌ను అదానీకి ఇస్తోంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. JK ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ ఇజ్రాయెల్ త‌యారు చేసే ఆయుధాల‌కు, డ్రోన్ల‌కు అదానీ స్టిక్క‌ర్లు అంటించి దీన్నే మేకిన్ ఇండియా అంటున్నార‌ని, ఇది ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. GST, నోట్లర‌ద్దు వంటివి పాల‌సీలు కావని, అదానీ-అంబానీల‌కు వ్యాపార మార్గాలు సుగ‌మ‌ం చేయ‌డానికి వాడిన ఆయుధాల‌ని రాహుల్ విమ‌ర్శించారు.

error: Content is protected !!