News September 26, 2024
Airtel యూజర్లకు గుడ్ న్యూస్
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం మొట్టమొదటి AI-పవర్డ్ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టింది. రియల్ టైంలో యూజర్లకు హెచ్చరికలు పంపేలా ఈ సరికొత్త వ్యవస్థను సంస్థ తీసుకొచ్చింది. ఈ సేవల వినియోగానికి ఎలాంటి సర్వీస్ రిక్వెస్టులు, యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ యూజర్లందరికీ ఉచితంగా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
Similar News
News October 9, 2024
నైజాంలో ఆల్ టైమ్ టాప్-5లోకి ‘దేవర’
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ నైజాం ఆల్‌టైమ్ కలెక్షన్ల జాబితాలో 5వ స్థానానికి చేరింది. 12 రోజుల్లోనే ఈ సినిమా రూ.56.07 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక తొలి నాలుగు స్థానాల్లో మూడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. అగ్రస్థానంలో RRR(రూ.111.85 కోట్లు) ఉంది. తర్వాతి 3 స్థానాల్లో వరసగా కల్కి 2898ఏడీ(రూ.92.80 కోట్లు), సలార్(రూ.71.40 కోట్లు), బాహుబలి 2(రూ.68 కోట్లు) ఉన్నాయి.
News October 9, 2024
అమ్మవారికి పూల దండ.. వేలంలో ఎంత పలికిందంటే!
AP: దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆనవాయితీ నడుస్తుంటుంది. అంబేడ్కర్ కోనసీమ(D) అమలాపురంలోని రమణం వీధిలో ఏటా అమ్మవారి మెడలో వేసే పూల దండకు వేలం పాట నిర్వహిస్తారు. ఈసారి ఓ భక్తుడు రూ.లక్షా మూడు వేలకు పూల దండను దక్కించుకున్నారు. అమ్మవారి మెడలో దండ వేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్ల క్రితం తొలిసారి వేలంపాటలో పూల దండ రూ.5వేలు పలికింది.
News October 9, 2024
దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!
TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.