news

News February 26, 2025

36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

image

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

News February 26, 2025

మహాకుంభమేళా ‘సిత్రాలు’

image

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.

News February 26, 2025

‘మజాకా’ మూవీ రివ్యూ

image

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5

News February 26, 2025

శివుడి మాదిరే మనకూ మూడో కన్ను!

image

మనుషులకు మూడో కన్ను అంటే శివుడి మాదిరి నుదుటిపై ఉంటుందని కాదు. భౌతికం కానివాటిని చూడగలగడం, అంతర్ముఖులం కావడం అని అర్థం. కర్మ స్మృతుల కారణంగా మానవుడు దేన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడలేడని, అలా చూసేందుకు లోతులకు చొచ్చుకుపోగలిగే, జ్ఞాపకాలతో కలుషితం కాని ఓ కన్ను కావాలని పండితులు చెబుతారు. అంతర్ దృష్టి ఏర్పడినప్పుడు మనలోని స్పష్టతను ప్రపంచంలో ఏదీ చెదరగొట్టదు. అదే జ్ఞానంతో కూడిన నిజమైన మూడో కన్ను.

News February 26, 2025

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,127 మంది భక్తులు దర్శించుకోగా, 19,307 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు సమకూరింది.

News February 26, 2025

శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా?

image

శివరాత్రి రోజు మీ లైఫ్‌స్టైల్‌కు తగిన ఉపవాసాన్ని ఎంచుకోవాలి.
*నిర్జల ఉపవాసం: చాలా కఠినంగా ఉంటుంది. ఎటువంటి ఆహారం, లిక్విడ్ తీసుకోరు. షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు ఇది చేయవద్దు.
*ఫలాహార ఉపవాసం: అరటి, యాపిల్, దానిమ్మ, జామ, పాలు, మజ్జిగ, పళ్లరసాలు, డ్రైఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు.
*ఏక భుక్త వ్రతం: ఉదయం భోజనం చేసి మిగతా రోజంతా పండ్లు తీసుకోవచ్చు.

News February 26, 2025

శివరాత్రి స్పెషల్.. చిలగడదుంప

image

చిలగడదుంప లేనిదే శివరాత్రి గడవదు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఈ దుంప కనిపిస్తుంది. ఉపవాసం ఉన్నవారు వీటిని ఉడకబెట్టుకొని తింటారు. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, స్టార్చ్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే కంటిచూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. శివరాత్రి నాడే కాకుండా ప్రతిరోజు తీసుకుంటే ఎంతో మేలని వైద్యులు చెబుతారు.

News February 26, 2025

కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు!

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. GHMC పరిధిలోనే లక్ష దాటాయన్నారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ సంఖ్య 10 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మార్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మార్చి 1న లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

News February 26, 2025

కులగణన రీసర్వే.. ఆసక్తి చూపని కుటుంబాలు

image

TG: కులగణన రీసర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా కుటుంబాలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండోసారి సర్వేలో 3,56,323 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,422 కుటుంబాలే ఎంట్రీ చేయించుకున్నాయి. రీసర్వేకు ఎల్లుండితో గడువు ముగియనుంది. సర్వేలో పాల్గొనాలనుకునేవారు ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు 040 21111111 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. MPDO ఆఫీసుల్లోనూ వివరాలు ఇవ్వొచ్చు.

News February 26, 2025

మహా శివరాత్రి: ఉపవాసం ఎవరు ఉండొద్దంటే?

image

పరమశివుడికి ఇష్టమైన మహా శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అయితే ఇవాళ అనారోగ్యం, నీరసంతో ఉన్నవారు, డయోబెటిస్ వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు చేయకపోవడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివనామ స్మరణ, ప్రవచనాలు వింటూ ఉండొచ్చని సూచిస్తున్నారు.