news

News September 25, 2024

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

image

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో దీనిని ప్రారంభించింది.

News September 25, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

News September 25, 2024

ఆ డేటా దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు కీల‌కం

image

జీవిత కాల గ‌రిష్ఠాల వ‌ద్ద ఉన్న బెంచ్ మార్క్ సూచీల‌కు దేశ ఆర్థిక ప‌రిస్థితిని స‌మ‌గ్రంగా విశ్లేషించే కొన్ని నివేదిక‌లు కీల‌కం కానున్నాయి. HSBC కాంపోజిట్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ PMI ఫ్లాష్‌లతో సహా రాబోయే ఆర్థిక డేటాపై ఇన్వెస్ట‌ర్లు దృష్టిసారించ‌నున్నారు. ఇవి దేశ ఆర్థిక పరిస్థితిపై ఇన్‌సైట్స్ ఇవ్వ‌నున్నాయి. రాబోయే రోజుల్లో FIIల ప్రవాహం, చమురు ధరలు సూచీల కదలికల్లో కీల‌క పాత్ర పోషించనున్నాయి.

News September 25, 2024

ఆ మ్యాచ్‌కోసం సర్ఫరాజ్‌ను రిలీజ్ చేయనున్న టీమ్ ఇండియా?

image

బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేని నేపథ్యంలో అతడిని జట్టు నుంచి విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఇరానీ కప్‌లో ముంబై, రెస్టాఫ్ ఇండియా మధ్య త్వరలో మ్యాచ్ జరగనుంది. తమ కీలక ఆటగాడు సర్ఫరాజ్‌ను ఆ మ్యాచ్‌కోసం పంపించాలని బీసీసీఐని ముంబై కోరవచ్చని సమాచారం. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ థాకూర్ తదితర ఆటగాళ్లంతా ఇరానీ కప్‌లో ఆడనున్నారు.

News September 24, 2024

ఆ పార్టీలు బీజేపీకి మరింత దగ్గరవుతున్నాయ్!

image

TDP, JDU కేంద్రంలో BJPకి మరింత దగ్గరవుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తిరుమ‌ల ప్ర‌సాదం వివాదంలో TDP-జ‌న‌సేన వైఖ‌రి, విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ఠ జ‌రిగిన 8 నెలల త‌ర్వాత అయోధ్య రామమందిర నిర్మాణంపై PM మోదీని బిహార్ CM నితీశ్ ప్రశంసించడం అందులో భాగమే అని చెబుతున్నారు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకు BJPకి దక్కకుండా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

News September 24, 2024

భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

image

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 24, 2024

శ్రేయస్ అయ్యర్ కొత్త ఇల్లు బాగా కాస్ట్‌లీ.. Sq.ftకి ₹55,238

image

చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్‌లతో 48వ ఫ్లోర్‌లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.

News September 24, 2024

భార్యను ఆర్థికంగా ఆదుకొనే బాధ్యత భర్తదే: ఢిల్లీ హైకోర్టు

image

భార్య సంపాదించగలిగినప్పటికీ, ఆమెను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత భర్తదేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమెను ‘పరాన్నజీవి’ అని పిలవడం ఆమెకే కాకుండా మహిళలందరికీ అగౌరవమే అని వ్యాఖ్యానించింది. భార్యకు భరణం చెల్లించాలన్న కింది కోర్టు ఆదేశాల‌ను భర్త SCలో సవాల్ చేశారు. కేసు విచారణ సందర్భంగా భారతీయ మహిళలు తమ కుటుంబం, పిల్లలు, భర్త-అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొంది.

News September 24, 2024

2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

TG: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2008లో డీఎస్సీ అర్హత సాధించి ఉద్యోగం పొందని అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో 1,200 మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. డీఎస్సీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా కేంద్రాలలోని డీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశమిచ్చింది.

News September 24, 2024

అర్జున్.. నువ్వు నాకు స్ఫూర్తి: సచిన్ టెండూల్కర్

image

తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘నా కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అర్జున్.. జీవితంపై నీకున్న ప్రేమ, రాజీపడని నిబద్ధత నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంటాయి. రోజూ ఉదయం క్రమం తప్పకుండా జిమ్ చేయడం నీ క్రమశిక్షణను సూచిస్తుంది. నీ గురించి ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నీ కలలను సాధించు’ అని విష్ చేశారు.

error: Content is protected !!