news

News February 26, 2025

ఇండోనేషియాలో భూకంపం

image

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉ.6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జకర్తా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2018లో సులవేసిలో భారీ భూకంపంతో 2,200 మంది, 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది.

News February 26, 2025

నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్

image

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్‌లో ఒకటి, సెమీస్‌లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్‌తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్‌, మాలేవర్‌లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.

News February 26, 2025

అహ్మదాబాద్ తరహాలో అమరావతిలో స్టేడియం: లోకేశ్

image

AP: అహ్మదాబాద్‌ మాదిరి అమరావతిలోనూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ కోసం తాను దుబాయ్ వెళ్లానని, ఆ సమయంలో మన జట్టుకు సపోర్ట్ చేయడంతో పాటు స్టేడియం నిర్మాణం, సీటింగ్ తదితరాలను పరిశీలించి జైషాతో మాట్లాడానన్నారు. దీనిపై కూడా YCP వాళ్లు తనను ట్రోల్ చేశారని వివరించారు.

News February 26, 2025

నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

image

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ అందడంతో రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చివరిసారి గతేడాది జులైలో ఆయన పీఎంతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంపై మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. అటు మూసీ సుందరీకరణ, శంషాబాద్ వరకు మెట్రోరైల్, RRR నిర్మాణం సహా విభజన చట్టంలోని పెండింగ్ పనులు, నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

News February 26, 2025

శివరాత్రి: ఇవాళ ఇలా చేస్తే..

image

శివ పదమణి మాల ప్రకారం శ అంటే శివుడు. వ అంటే శక్తి అని అర్థం. శివ అంటే శుభపద్రం, మంగళకరం, శ్రేయస్కరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి వేళ ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. స్పటిక లేదా వెండి లింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

News February 26, 2025

మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.

News February 26, 2025

కార్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఫార్ములా మర్చిపోవద్దు!

image

బ్యాంకు లోన్ తీసుకొని కారు కొంటున్నవారు 20/4/10 ఫార్ములాను తప్పక పాటించాలి. ఈ రూల్ ప్రకారం కార్ ఆన్ రోడ్ ప్రైజ్‌లో 20% డౌన్‌పేమెంట్ చెల్లించాలి. లోన్ గరిష్ఠ టెన్యూర్ 4ఏళ్లకు మించకూడదు. EMI మీ నెలవారీ సంపాదనలో 10శాతానికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. బ్యాంకులు 8.70% నుంచి 10% వడ్డీతో కార్ లోన్లు ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ శాతం అంచనా వేస్తారు.

News February 26, 2025

ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

image

రాజస్థాన్‌లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.

News February 26, 2025

నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

image

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తెలిపారు.

News February 26, 2025

మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

image

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.