India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలోని నాగార్జునకు చెందిన <<13929013>>ఎన్<<>> కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది. అందులో అద్దె రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో 37వేలు, 27వేలు, 7వేలు, 5వేల చ. అడుగుల విస్తీర్ణంతో 4 హాళ్లు ఉంటాయి. ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు, గెట్ టు గెదర్ పార్టీలు ఇందులో జరుపుకుంటారు. అక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు మ.3 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ అధ్యక్ష పదవి, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించనున్నారు.
TG: అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు తీసుకొచ్చిన హైడ్రా పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. GO 111 పరిధిలోని 84 గ్రామాలకు దీనిని వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిధిలోని ఈ గ్రామాలు బఫర్ జోన్‌లోకి వెళ్లగా కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను తిరిగి తీసుకొస్తే నిర్మాణాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది.
మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MSPతో పాటు రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, బడ్జెట్‌లోనూ పట్టించుకోలేదని విమర్శించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని నిర్ణయించాయి.
TG: RTC ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వారికి చెల్లించాల్సిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ సొమ్ము, DAలు, PF బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలను RTC ఉద్యోగులకూ అమలు చేయాలని CMను కోరతామన్నారు. ఇక RTCలో రాజకీయ జోక్యం ఉండదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఉద్యోగుల లక్ష్యం కావాలన్నారు.
దేశవ్యాప్తంగా 768 బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. గోవాలోని పార్టీ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. వీటిలో ఇప్పటికే 563 సిద్ధమవ్వగా, మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. 2013లో జరిగిన గోవా సమావేశంతోనే బీజేపీ విజయాల బాట పట్టిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది.
AP: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఎవరైనా వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అవుతుంటే వారికి సాధారణ బదిలీలు చేయబోమని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనం కోసమే ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వేరే ఏ ఇతర పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. మొత్తం 86,943 సీట్లకు గానూ 75,107 మంది ప్రవేశాలు పొందారు. దీంతో 11,836 సీట్లు మిగిలిపోయాయని విద్యాశాఖ వెల్లడించింది. ఏఐ, సీఎస్ఎన్, సీఎస్ఏ వంటి కోర్సుల్లో పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగాయి. కాగా సీట్ల భర్తీకి కాలేజీ యాజమాన్యాలు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునే అవకాశం ఉంది.
TG: హాస్టళ్లలో నెలకోసారి నిద్ర చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తే అక్కడి పరిస్థితులు మెరుగవుతాయని చెప్పారు. హాస్టల్స్, స్కూళ్ల విజిటింగ్, నిద్ర చేయడం వంటివి ప్రతి నెలా కలెక్టర్లు చేపట్టే కార్యక్రమాల్లో ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.