news

News December 30, 2024

దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?

image

భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.

News December 30, 2024

మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కాంగ్రెస్‌

image

మ‌న్మోహ‌న్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థిక‌ల‌ను య‌మునా న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు పాల్గొన‌లేదని కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌న్మోహ‌న్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ క‌లిసి పరామర్శించారని తెలిపింది. అస్థిక‌లు న‌దిలో క‌లిపే విష‌య‌మై వారితో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కాంగ్రెస్ వెల్ల‌డించింది.

News December 30, 2024

స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్

image

ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.

News December 30, 2024

ఒక్క సిగరెట్‌ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?

image

ఒక సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నార‌ని ఓ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్య‌య‌నం చేశారు. ధూమ‌పానం వ‌ల్ల‌ ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతార‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. జీవితం చివ‌ర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హ‌రిస్తుంద‌ని వివరించారు.

News December 30, 2024

యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్

image

AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.

News December 30, 2024

కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్‌ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.

News December 30, 2024

vitamin D దొరికే ఫుడ్స్ ఇవే

image

ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

News December 30, 2024

సిఫారసు లేఖల వ్యవహారం: రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.

News December 30, 2024

‘స్పేడెక్స్ మిషన్’ అంటే?

image

శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో ఇవాళ రాత్రి 10 గంటలకు <<15018046>>PSLV-C60<<>> ద్వారా ‘స్పేడెక్స్ మిషన్’ను నింగిలోకి పంపనుంది. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ప్రయోగం. ఉపగ్రహాల్ని డాకింగ్, అన్ డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయడం, ప్రదర్శించడం దీని లక్ష్యాలు. అంతరిక్షంలో రెండు వ్యోమనౌకలను పక్కపక్కన చేర్చి లింక్ చేయడాన్ని స్పేస్ డాకింగ్ అని, లింకై ఉన్న వాటిని వేరు చేయడాన్ని అన్ డాకింగ్ అని అంటారు.

News December 30, 2024

టీమ్ ఇండియాకు కొత్త కోచ్ రావాల్సిందేనా?

image

గంభీర్ కోచింగ్‌లో IND టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతోంది. స్వదేశంలో BANపై 2-0 తేడాతో సిరీస్ గెలిచినా ఆ తర్వాత NZ చేతిలో 3-0 తేడాతో ఓడింది. ప్రస్తుతం BGTలో 2-1 తేడాతో వెనుకబడింది. WTC ఫైనల్‌కు వెళ్లే అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో T20, ODIలకు గంభీర్‌ను కొనసాగిస్తూ టెస్టులకు స్పెషలిస్ట్ కోచ్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు?