news

News December 29, 2024

నుమాయిష్ ప్రారంభం వాయిదా

image

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.

News December 29, 2024

WTC ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికా తొలిసారిగా WTC ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌కు వెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి వరకూ అద్భుతంగా పోరాడింది. 56కే 4 వికెట్లు కోల్పోయినా చివర్లో రబాడ (31*), జాన్సెన్ (16*) రాణించడంతో విజయం సాధించింది. రెండో స్థానం కోసం భారత్ (55.89), ఆస్ట్రేలియా (58.89) పోటీ పడుతున్నాయి.

News December 29, 2024

పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ సమాధానమిదే

image

TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటపై పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ స్పందించింది. ‘‘పుష్ప 2’ కోసం 4, 5 తేదీల్లో మైత్రీ మూవీస్ బుక్ చేసుకుంది. మా థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. చాలామంది హీరోలు ఇక్కడికి వచ్చినా ఇలాంటివి జరగలేదు. ఫ్యాన్స్ చొచ్చుకురావడంతోనే తొక్కిసలాట జరిగింది. 45 ఏళ్లుగా మేం థియేటర్‌ను నడిపిస్తున్నాం’ అని నోటీసుల్లో పేర్కొంది.

News December 29, 2024

ఆ రైలు వేగం గంటకు 450 కి.మీ

image

గంటకు గ‌రిష్ఠంగా 450 KM వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది. CR450 రైలుకు Sun ట్ర‌య‌ల్‌ర‌న్ నిర్వ‌హించారు. ఇంజిన్ పరీక్షల్లో 400 KM అందుకుంది. గతంలో ప్రవేశపెట్టిన CR400 కంటే 20% ఇంధనాన్ని త‌క్కువ వినియోగిస్తూ, 12% బ‌రువు త‌క్కువ ఉండే CR450 బీజింగ్ నుంచి షాంఘైకి (1,214 KM) రెండున్న‌ర గంటల్లో చేరుకోగ‌ల‌దు. ఇది ప్ర‌పంచంలోనే వేగంగా న‌డిచే ప్యాసింజ‌ర్ రైలుగా రికార్డుకెక్క‌నుంది.

News December 29, 2024

ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదులు హతం

image

JKలో ఈ ఏడాది 75 మంది ఉగ్ర‌వాదుల్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎన్‌కౌంట‌ర్ చేశాయి. వీరిలో 60% మంది పాక్ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్టు ఆర్మీ వెల్ల‌డించింది. ఈ ప్రాంతంలో కేవలం న‌లుగురు స్థానికుల్ని రిక్రూట్ చేయ‌డం ద్వారా భార‌త్‌పై బ‌య‌టిశ‌క్తుల్ని ఎగదోయడంలో పాక్ పాత్ర స్పష్టమవుతోంది. హ‌త‌మైన 75 మంది ఉగ్ర‌వాదుల్లో మెజారిటీ విదేశీయులే ఉన్నారు. కొంద‌రు LOC వద్ద చొర‌బ‌డేందుకు య‌త్నించ‌గా ఆర్మీ ఎన్‌కౌంట‌ర్ చేసింది.

News December 29, 2024

విద్యార్థులకు శుభవార్త

image

AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

News December 29, 2024

జనవరి 5న ‘డాకు మహారాజ్’ థర్డ్ సింగిల్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. జనవరి 5న ఈ మూవీ థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశీ రౌతేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

News December 29, 2024

అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్?: బుగ్గన

image

AP: అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్ అని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘6 నెలల్లోనే రూ.1,12,750 కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారు? ఇప్పటివరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టో ఏమయ్యింది?’ అని ఆయన ప్రశ్నించారు.

News December 29, 2024

దేవుడి దగ్గర రాజకీయలు ఎందుకు?: శ్రీనివాస్ గౌడ్

image

TG: తిరుమల శ్రీవారి ఆలయంలో అందరినీ సమానంగా చూడాలని BRS నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ అనే బేధాభిప్రాయాలు లేవు. సిఫారసు లేఖలు ఆపితే ఇకపై ఇలాంటి తేడాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆలయాల్లో అందరినీ సమానంగా చూస్తున్నాం. దేవుడి దగ్గర రాజకీయం ఎందుకు? చంద్రబాబు, TTD ఛైర్మన్ కూడా HYDలో ఉంటున్నారు. మేం ఏమైనా తేడాగా ప్రవర్తించామా?’ అని ఆయన ప్రశ్నించారు.

News December 29, 2024

ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీలు వీరే

image

వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్-అఫ్గానిస్థాన్, వనిందు హసరంగ, కుశాల్ మెండిస్-శ్రీలంక, షెర్ఫానే రూథర్‌ఫర్డ్-వెస్టిండీస్ ఉన్నారు. ఈ ఏడాది వన్డేల్లో వీరు అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఐసీసీ వీరిని ఎంపిక చేసింది. భారత్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకోలేదు.