News December 29, 2024
దేవుడి దగ్గర రాజకీయలు ఎందుకు?: శ్రీనివాస్ గౌడ్
TG: తిరుమల శ్రీవారి ఆలయంలో అందరినీ సమానంగా చూడాలని BRS నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ అనే బేధాభిప్రాయాలు లేవు. సిఫారసు లేఖలు ఆపితే ఇకపై ఇలాంటి తేడాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆలయాల్లో అందరినీ సమానంగా చూస్తున్నాం. దేవుడి దగ్గర రాజకీయం ఎందుకు? చంద్రబాబు, TTD ఛైర్మన్ కూడా HYDలో ఉంటున్నారు. మేం ఏమైనా తేడాగా ప్రవర్తించామా?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News January 25, 2025
స్టైలిష్ లుక్‌లో రవితేజ.. రేపు గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
News January 25, 2025
మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.