news

News August 20, 2024

CSKలోకి రిషభ్ పంత్?

image

IPLలో రిషభ్ పంత్ CSKలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పంత్ పెట్టిన ఓ పోస్టే అందుకు కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరిస్తూ కుర్చీలో కూర్చొని ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ‘తలైవా’ అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి రజినీని ట్యాగ్ చేశారు. గతంలో ఓసారి ధోనీ సైతం ఇలాగే తలైవా స్టైల్‌లో ఫొటో పోస్టు చేశారు. MSD కెరీర్ ముగుస్తుండటంతో ఆ స్థానాన్ని పంత్ భర్తీ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలైంది.

News August 20, 2024

యూఏఈలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్

image

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా స్టేడియాల్లో WC మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.

News August 20, 2024

స్పామ్ కాల్స్‌ నియంత్రణకు TRAI కీలక ఆదేశాలు

image

టెలీ మార్కెటింగ్ కాల్స్‌(14 సిరీస్‌తో ప్రారంభమయ్యే)ను బ్లాక్ చెయిన్ సాయంతో పని చేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీకి మార్చాలని టెలికం కంపెనీలను TRAI ఆదేశించింది. ఇందుకు SEP 30ని గడువుగా నిర్దేశించింది. SEP 1 నుంచి వెబ్‌సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన మెసేజ్‌లు పంపకూడదని ఆదేశాల్లో పేర్కొంది. గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను NOV 1 నుంచి పూర్తిగా ఆపేయాలంది.

News August 20, 2024

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

News August 20, 2024

మంకీపాక్స్ చికిత్సపై ఢిల్లీ ఎయిమ్స్ గైడ్‌లైన్స్

image

మంకీపాక్స్ అనుమానితుల చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు విడుదల చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది. రీసెంటుగా మంకీపాక్స్ బాధితుల్ని ఎవరినైనా కలిశారేమో కనుక్కోవాలని చెప్పింది. వైద్య సిబ్బంది PPE కిట్లను ధరించాలని తెలిపింది.

News August 20, 2024

DANGER: చెవిలో వేలు పెడుతున్నారా?

image

చెవిలో గులిమి తీసేందుకు చిటికెన వేలు పెట్టడం ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. నీళ్లు పోయడం, దూది/ఇయర్ బడ్స్/కాటన్ బడ్స్ పెట్టడం మరింత డేంజర్ అంటున్నారు. దాని వల్ల గులిమి మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు ఆల్మండ్/ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటారు. ఇదీ 100% ఉత్తమమని చెప్పలేం. చెవుల్లో ఎక్కువ గులిమి ఉంటే డాక్టర్ల సూచనలతో ఇయర్ డ్రాప్స్ వేసుకోవడం మంచిది. > SHARE

News August 20, 2024

మంకీపాక్స్ టీకా తయారీకి కృషి: సీరమ్

image

మంకీపాక్స్‌కు టీకా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే సానుకూల ఫలితాలు చూస్తామని అంచనా వేసింది. ప్రమాదంలో పడ్డ లక్షల మంది కోసం వ్యాక్సిన్ తయారు చేస్తామంది. ఆందోళన కలిగిస్తున్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి భారత్‌లో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాధిపై ఇప్పటికే సూచనలు ఇచ్చింది.

News August 20, 2024

ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

image

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదినం సందర్భంగా ఆయా స్టార్లు నటించిన మూవీలను మరోసారి విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన తొలి మూవీ ఈశ్వర్‌తో పాటు డార్లింగ్ కూడా రీ-రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈశ్వర్ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు.

News August 20, 2024

రాష్ట్రంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి

image

AP: రాష్ట్రంలో CBI విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. అయితే స్టేట్ ఎంప్లాయిస్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అప్పట్లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు రాష్ట్రంలో CBI విచారణను రద్దు చేశారు.

News August 20, 2024

తగ్గిన ధరలు సరిపోవు: ఆర్బీఐ గవర్నర్

image

నాలుగు శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణంతో వడ్డీరేట్లు తగ్గించలేమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ధరలు ఇంకా తగ్గాలని, అప్పటి వరకు ఓపికగా ఉండాలని సూచించారు. వడ్డీరేట్లు తగ్గించాలంటే ద్రవ్యోల్బణం నిలకడగా 4% లోపే ఉండాలని నొక్కిచెప్పారు. భారత వృద్ధిరేటుకు తిరుగులేదని, ఎకానమీ స్థిరంగా ఉందన్నారు. లక్షిత ద్రవ్యోల్బణంలో ఆహారాన్ని తీసేయడం సరికాదని, ప్రజలు వాటిపైనే ఎక్కువ ఖర్చు చేస్తారని తెలిపారు.