News December 27, 2024
Stock Market: గ్రీన్‌లో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు Friday లాభాలతో ముగిశాయి. Sensex 78,699 (+226) వద్ద, Nifty 87 పాయింట్లు ఎగసి 23,837 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా 1.30%, ఆటో 0.97%, హెల్త్‌కేర్ 0.80% లాభపడడంతో సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సెషన్ ప్రారంభంలో గంటపాటు ర్యాలీ జరిగినా Sensexలో 79,000 వద్ద, Niftyలో 23,900 వద్ద బలమైన Resistance ఉండడంతో సూచీలు రివర్సల్ తీసుకున్నాయి.
Similar News
News January 22, 2025
దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.
News January 22, 2025
విజయ పరంపర కొనసాగుతుందా?
ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.
News January 22, 2025
పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు
పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 12-30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామన్నారు. కలుషితమైన నీరు/ఆహారం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాన్సుందని డాక్టర్లు చెబుతున్నారు.