news

News February 25, 2025

వంశీపై మరో కేసు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో తమ పేరిట ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు లాయర్ సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే జైలులో ఉన్న వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

News February 25, 2025

వన్డేల్లో కోహ్లీనే ఉత్తమ ప్లేయర్: పాంటింగ్

image

పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ ప్లేయర్ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. వన్డే ఫార్మాట్‌లో విరాట్ కన్నా ఉత్తమ బ్యాటర్‌ను తాను చూడలేదని చెప్పారు. ఆయనలో పరుగుల దాహం ఉన్నంత వరకు ఫిట్‌గానే ఉంటారన్నారు. వన్డేల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తారని అభిప్రాయపడ్డారు. పాక్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ 51వ ODI సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

News February 25, 2025

ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం ఎంతమందికి తెలుసు? నేపాల్‌లో ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ వీడియో షేర్ చేశాడు. అయితే, ప్రభాస్‌కు ఈ ఊరికీ ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లీల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే.

News February 25, 2025

టాటా గ్రూప్ నుంచి IPOకు మరో కంపెనీ

image

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. IPO ప్రణాళికలను ఆమోదించినట్టు టాటా క్యాపిటల్ మంగళవారం తెలిపింది. ఫ్రెష్ ఇష్యూ కింద 23 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు OFS కింద స్టాక్స్ ఇవ్వనుంది. రూ.1504 కోట్ల విలువైన షేర్లను రైట్స్ ఇష్యూ కింద కేటాయిస్తోంది. నోటిఫై చేసిన మూడేళ్లలో అప్పర్ లేయర్ NBFCలు IPOకు రావాలన్న RBI నిబంధనల మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

News February 25, 2025

మార్చి 1న కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

image

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.

News February 25, 2025

ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

image

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News February 25, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్

image

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.

News February 25, 2025

అసెంబ్లీకి వెళ్లేది లేదన్న జగన్.. మీరేమంటారు?

image

YS జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సరైన వేదిక అని, ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో 10% సీట్లు లేని YCPకి ఎలా ఇస్తారని కూటమి శ్రేణులు నిలదీస్తున్నాయి. అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని YCP అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News February 25, 2025

ఐసీసీ ట్రోఫీలు: రోహిత్ మరో టైటిల్ సాధిస్తారా?

image

ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ రికార్డు కంటిన్యూ అవుతోంది. రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా గత 5 ట్రోఫీల్లో సెమీఫైనల్స్‌కు వెళ్లింది. 2022 టీ20 WCలో సెమీస్, 2021-23 WTC రన్నరప్, 2023 వన్డే WCలో రన్నరప్, 2024 టీ20 WCలో విజయం, తాజాగా 2025 CTలో సెమీఫైనల్స్ చేరింది. మరి రోహిత్ మరో ఐసీసీ కప్పు కొడతారా? కామెంట్ చేయండి.

News February 25, 2025

పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

image

AP: ఎలక్ట్రానిక్ చిప్‌లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.