News December 27, 2024

కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం?

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఆదాయపరిమితి ప్రస్తుతం గ్రామాల్లో ₹1.50L, పట్టణాల్లో ₹2L ఉండగా, దాన్ని మరో ₹20K పెంచుతారని తెలుస్తోంది. ప్రజా పాలనలో 10L దరఖాస్తులు రాగా JAN మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. కార్డుల్లో మార్పులపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం. 30న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Similar News

News January 14, 2025

మహా కుంభమేళా: స్టీవ్ జాబ్స్ భార్యకు అలర్జీ

image

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ భార్య పావెల్ (61) అనారోగ్యానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారీ జన సందోహం మధ్య నదిలో స్నానం చేయడంతో అలర్జీలు వచ్చినట్లు తెలిపింది. కాగా నిరంజని అఖారా సూచనతో పావెల్ ఇండియాకు వచ్చి, మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆమెకు ఆ స్వామీజి ‘కమల’ అని నామకరణం చేశారు. పావెల్ భారత సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారని ఆయన చెప్పారు.

News January 14, 2025

ఆస్కార్స్ 2025: నామినేషన్స్ ప్రకటన వాయిదా

image

లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆస్కార్స్-2025 నామినేషన్స్ ప్రకటన వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‌ను పొడిగించారు. ఈనెల 17న నామినేషన్స్‌ను వెల్లడించాల్సి ఉండగా, 23వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజున వర్చువల్‌గా నామినీల లిస్టును ప్రకటించనున్నారు. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు.

News January 14, 2025

రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్

image

భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.