news

News October 29, 2024

‘సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తాం’ కేసులో మరొకరి అరెస్టు

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్, MLA జీషన్ సిద్ధిఖీని చంపుతామని బెదిరించిన కేసులో మరొకరిని ముంబై పోలీసులు కనుగొన్నారు. నోయిడాలో గుఫ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండుకు పంపించారు. డబ్బులివ్వకపోతే చంపేస్తామని సల్మాన్, జీషన్ ఆఫీస్‌కు శుక్రవారం కాల్స్ వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ముందు మహ్మద్ తయ్యబ్‌ను ఆ తర్వాత జంషెడ్‌పూర్‌లో షేక్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు.

News October 29, 2024

పోలీసులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి: RSP

image

TG: సీఎం రేవంత్ భద్రతా సిబ్బందిలో బెటాలియన్ పోలీసులను తొలగించడాన్ని BRS నేత RS ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. ‘ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. సీఎం రేవంత్.. అర్జంటుగా మౌనం వీడి బెటాలియన్లకు వెళ్లండి. కానిస్టేబుళ్ల కుటుంబాలతో మాట్లాడండి. మీ అనాలోచిత చర్యల వల్ల పోలీసులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అంతర్గత భద్రతకు సంబంధించి ఇది సీరియస్ ఇష్యూ’ అని ట్వీట్ చేశారు.

News October 29, 2024

మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన కోహ్లీ.. ఎందుకంటే?

image

మ్యాక్స్‌వెల్, కోహ్లీ మంచి ఫ్రెండ్స్. అయితే గతంలో మ్యాక్సీ చేసిన ఓ పనికి కోపమొచ్చి అతణ్ని కోహ్లీ ఇన్‌స్టాలో బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మ్యాక్సీ స్వయంగా వెల్లడించారు. కోహ్లీని బ్లాక్ చేశావా అని అడిగితే ‘అవును బ్లాక్ చేశా. నువ్వు రాంచీ టెస్టు(IND vs AUS 2017)లో నన్ను ఎగతాళి చేశావు. అందుకే’ అని తనకు బదులిచ్చినట్లు మ్యాక్సీ చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ తనను అన్‌బ్లాక్ చేసినట్లు కూడా మ్యాక్సీ తెలిపారు.

News October 29, 2024

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబూమోహన్

image

TG: సీనియర్ నటుడు బాబూమోహన్ TDP సభ్యత్వం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మెంబర్షిప్ తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులో బాబూమోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురయ్యారు. బాబూమోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1999లోనూ విజయం సాధించి, మంత్రి అయ్యారు. అనంతరం TRSలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News October 29, 2024

కృష్ణుడిగా మహేశ్ బాబు.. నిజమిదే!

image

‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణుడి పాత్రలో కనిపిస్తారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, ఆయన ఎలాంటి పాత్రలో నటించడం లేదని సినీవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మూవీ టీమ్ అలాంటి ప్లాన్ కూడా చేయలేదని తెలిపాయి. రాజమౌళి సినిమా కోసమే మహేశ్ సిద్ధమవుతున్నారని, లుక్ కూడా ఆ చిత్రం కోసమేనని వెల్లడించాయి. కాగా, SSMB29 షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది.

News October 29, 2024

కరోనా వ్యాక్సిన్‌తో తీవ్రమైన గుండె జబ్బులు: అధ్యయనం

image

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మనుషులు చనిపోతున్న వేళ దక్షిణ కొరియా పరిశోధకులు చేసిన ఆధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు mRNA కొవిడ్ వ్యాక్సిన్లతో ముడిపడి ఉన్నట్లు తేలింది. ఆస్ట్రాజెనెకా, జాన్సెన్ టీకాలతో పోల్చితే mRNA వ్యాక్సిన్ (Pfizer-BioNTech, Moderna) తీసుకున్న వారు తీవ్రమైన గుండె జబ్బులు ఎదుర్కొంటారని తెలిసింది. ఈ ప్రమాదం 10-59 ఏళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

News October 29, 2024

కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

image

TG: తనకు KTR లీగల్ నోటీసులు పంపడాన్ని BJP MP బండి సంజయ్ తప్పుబట్టారు. రాజకీయ విమర్శలు చేస్తే నోటీసులు పంపిస్తారా? అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడా కేటీఆర్ పేరు ప్రస్తావించలేదని, తనకే KTR బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు.

News October 29, 2024

హైకోర్టులో వైసీపీ ఎంపీకి ఊరట

image

AP: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

News October 29, 2024

టాటాలే స్ఫూర్తి.. రూ.20,000 కోట్లు దాతృత్వం

image

రియల్ ఎస్టేట్ దిగ్గజం అభిషేక్ లోధా కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం రూ.20,000 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. మాక్రోటెక్ డెవలపర్స్‌లో 18-19 శాతం వాటాను సేవా సంస్థ ‘లోధా ఫిలాంథ్రోపీ ఫౌండేషన్’‌కు బదిలీ చేస్తామంది. మహిళా సాధికారత, విద్య తదితర కార్యక్రమాలపై ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. ఈ విషయంలో తమకు టాటాలే ఆదర్శమని అభిషేక్ చెప్పారు.

News October 29, 2024

టపాసులు కాలుస్తున్నారా?

image

దీపావళి వచ్చేసింది. పిల్లలంతా ఓ చోటకు చేరి సందడిగా గడుపుతూ టపాసులు కాల్చుతుంటారు. అయితే, కొందరు సరదా కోసం టపాసులను మూగజీవాలపైకి విసురుతూ ఆనందపడుతుంటారు. వాటి శబ్దానికి వీధి కుక్కలు, ఆవులు, ఇతర జీవాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటాయి. కాబట్టి, వాటిపై క్రాకర్స్ విసిరి ఇబ్బందిపెట్టకుండా ఆనందంగా పండుగ జరుపుకోండి. దీంతోపాటు రోడ్డుపై ప్రజల రాకపోకలను గమనిస్తూ, వృద్ధులకు దూరంగా టపాసులు కాల్చుకోండి.