India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 24,600 ఎగువన, సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 80,700 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఐటీ, మెటల్స్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలు లాభాలను నమోదు చేశాయి. అయితే, ఆటో, బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెంటిమెంట్ మిశ్రమంగా ఉండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నట్టు మొదటి 15 నిమిషాల డౌన్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా.. విశాఖ, ప.గో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ అలవెన్సులు రెండోసారి పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్‌లో పెంపు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. డీఏ 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది. ఇక కొవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ అలవెన్సులను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం.
సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ గురించి తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పవర్‌స్టార్ బర్త్ డే సందర్భంగా SEP 2న స్పెషల్ ట్రీట్ రాబోతోందంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. ‘బిగ్గెస్ట్ సిల్వర్ స్క్రీన్ స్ట్రోమ్‌కు ముందు సైలెన్స్ ఉంటుంది. త్వరలో కలుద్దామ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఫస్ట్ సింగిల్ లేదా BGMతో గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఘోరమైన హత్యాచారాల దోషులకు సైతం భారత్‌లో ఉరి శిక్ష పడటం చాలా అరుదు. ఏళ్ల తరబడి విచారణలు, క్షమాభిక్షలు, మానవ హక్కులు వంటి పలు అంశాలు వారిని రక్షిస్తుంటాయి. కానీ కొన్ని దేశాల్లో దోషుల్ని చంపటమే సరైనదిగా భావిస్తారు. సౌదీలో రేపిస్టులకు బహిరంగ శిరచ్ఛేదం ఉంటుంది. ఉత్తర కొరియాలో కాల్చి చంపుతారు. ఇక పాక్, చైనా, ఇరాక్, ఈజిప్టు, క్యూబా, యూఏఈ, అఫ్గాన్ దేశాల్లోనూ దోషులకు మరణశిక్షలే అమలుచేస్తారు.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం హీరో వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ తాతయ్య, తండ్రి, బాబాయ్ బాటలో నడుస్తూ హీరో అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసిన ఆయన.. ఇటీవల ఓ ఫొటోషూట్ చేశారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.
AP: <<13757801>>బీమా<<>> విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి ₹3వేల కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిమితి ₹25 లక్షలు ఉండగా, బీమా పరిమితి ₹2.50 లక్షలు ఉంటుంది. రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే సర్కారు చెల్లిస్తుంది.
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురిపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సెబీ ప్రతినిధులు కూడా ఈ దర్యాప్తు సంఘంలో ఉంటారని సమాచారం. అయితే, సెబీ చీఫ్‌గా మాధబి కొనసాగుతున్న నేపథ్యంలో, ఆమె నియంత్రణలోని సంస్థ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అయితే కమిటీ విచారణపై అనుమానాలు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
AP: బహిరంగ మార్కెట్‌లో టమాటా KG ₹20-25 వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురంలోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో వ్యాపారులు చాలా వరకు పంటను కొనడం లేదు. 15 KGల బాక్సుకు రూ.100-200 మధ్యే రేటు కేటాయిస్తున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు తర్వాత అనంతపురంలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఆరుగురు పిడుగుపాటుకు బలయ్యారు. గద్వాల(D) క్యాతూర్‌లో వేముల రాజు(40), గట్టు మండలంలో నల్లారెడ్డి(30), మల్దకల్‌లో ఆదిలక్ష్మి(15) దుర్మరణం పాలయ్యారు. అలాగే వికారాబాద్(D) తాండూరులో కార్తీక్(15), పెద్దపల్లి(D) పందులపల్లిలో నారాయణ(58), మంచిర్యాల(D) బిట్టుర్పల్లిలో భాస్కర్ గౌడ్ మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.