India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైద్యురాలి హత్యాచారంపై స్పందించిన రాహుల్ గాంధీపై TMC ప్రతి విమర్శలు చేసింది. సిద్దరామయ్యతో రాజీనామా ఎప్పుడు చేయిస్తారని ప్రశ్నించింది. ‘రాహుల్ జీ, మీ CMను రాజీనామా చేయమంటారా? ఆయనపై వచ్చినవి అవినీతి ఆరోపణలు. బెంగాల్ ఘటనపై, CM మమత తీసుకున్న చర్యలేంటో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో మీరు కామెంట్స్ చేశారు. ఇప్పుడిక మీ సీఎంపై చర్యలు తీసుకుంటారా’ అని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ ట్వీట్ చేశారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గొంతు నొక్కడం వల్లే ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఒంటిపై 14 చోట్ల తీవ్ర గాయాలు కాగా గొంతు దగ్గర ఎముకలు విరిగినట్లు గుర్తించారు. కొనఊపిరితో ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో మత్తుమందు కలిపారా అనే దానిపై ఫోరెన్సిక్ నివేదిక తర్వాత స్పష్టత రానుంది.
AP: శ్రీసిటీలో 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని CM చంద్రబాబు చెప్పారు. అక్కడ పలు ప్రాజెక్టులను ఆరంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో సంక్షేమం, సాధికారత సాధ్యమవుతుంది. గతంలో PPP విధానంలో హైటెక్ సిటీని నిర్మించా. ఇప్పుడు ప్రతి నలుగురు IT నిపుణుల్లో ఒక AP వ్యక్తి కనిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
స్కూలు ఫీజుల పెరుగుదలకు రియల్ ఎస్టేటే కారణమని జోహో CEO శ్రీధర్ వెంబు అన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ స్థిరాస్తి ధరలు కొండెక్కాయని పేర్కొన్నారు. HYDలో <<13872405>>LKG ఫీజు<<>> రూ.3.7L అన్న వార్తలపై స్పందించారు. ‘అవినీతి డబ్బును రాజకీయ నేతలు స్థిరాస్తిలో పెడుతున్నారు. దాంతోనే ధరలు పెరుగుతున్నాయి. ఒకరకంగా ఖరీదైన ఇళ్లు, విద్య, వైద్యం రూపంలో రాజకీయ అవినీతికి మనమే డబ్బు చెల్లిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
AP: ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ఈ పథకం కింద రూ.వేల కోట్ల పనులు చేయబోతున్నందున ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
AP: రాష్ట్రంలో ప్రతి వ్యవస్థని వైసీపీ నాశనం చేసిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కూటమి గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరూ మిగలరని అన్నారు. కానీ తమ నాయకుడు చంద్రబాబు ఎవరినీ చేర్చుకోబోమని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
AP: తన జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అండగా ఉంటూ రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ AP కాంగ్రెస్ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. YSR అనే బంధంతో తనకు తోబుట్టువుల్లాగా ఉండి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నారని పేర్కొన్నారు. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే బంధమే రక్షాబంధన్ అని తెలిపారు. కాగా అన్న జగన్ పేరును ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం.
TG: తల్లి అంత్యక్రియలకు డబ్బుల కోసం భిక్షాటన చేసిన బాలికకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం రేవంత్ భరోసానిచ్చారు. విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని <<13884804>>నిర్మల్<<>> కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. CM ఆదేశాలతో ఆమెకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనమవుతోందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. మహిళలకు అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా రాజ్‌భవన్లో తనను కలిసిన మహిళా వైద్యులు, నేతలకు అభయమిచ్చారు. ‘మన కూతుళ్లు, అక్కచెల్లెళ్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. వారు సంతోషంగా, భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించాలి. ఇది మన కనీస ధర్మం. మనది సుదూర లక్ష్యమని తెలుసు. మీ వెంట నేనున్నా. మనం దాన్ని కచ్చితంగా చేరగలం’ అని ఆయన అన్నారు.
రాజ్ కుమార్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ2’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ రూ.204 కోట్లు వసూలు చేసినట్లు సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలి రోజు కన్నా నాలుగో రోజే అత్యధిక కలెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూ.50 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.
Sorry, no posts matched your criteria.