news

News August 19, 2024

హైకోర్టులో దువ్వాడ పిటిషన్

image

AP: తన భార్య వాణి, కుమార్తె హైందవిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ YCP MLC దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాడి చేసి, రోజుల తరబడి టెక్కలిలోని తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 41A నోటీసులిచ్చినట్లు పోలీసులు వివరించగా, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

News August 19, 2024

ఓట్లు సరిపోల్చాలని కోరుతూ బాలినేని పిటిషన్

image

AP: ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌లలో రీకౌంటింగ్(ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్లు సరిపోల్చడం) కోరుతూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు ఆయన విజ్ఞప్తితో ఇవాళ్టి నుంచి 12 చోట్ల మాక్ పోలింగ్ జరుగుతోంది.

News August 19, 2024

త్రివిక్రమ్‌తో విభేదాలపై హరీశ్ శంకర్ ఏమన్నారంటే?

image

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచే త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారని గుర్తు చేశారు. తన తండ్రి గురూజీకి పెద్ద ఫ్యాన్ అని ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చిట్‌చాట్‌లో తెలిపారు. త్రివిక్రమ్ అంటే తనకు గౌరవమని, ఆయన చాలా సీనియర్ అని పేర్కొన్నారు. తమ ఇద్దరిపై జరుగుతున్న ప్రచారం చూసి నవ్వుకుంటానని తెలిపారు.

News August 19, 2024

ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మ.1-5 గంటల మధ్య వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అటు ఏపీలోని అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

News August 19, 2024

సీఎం మమతను షూట్ చేయాలని యువతి పోస్టు.. అరెస్టు

image

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై హింసను ప్రోత్సహించేలా పోస్టు పెట్టిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తరహాలో మమతను షూట్ చేయాలి. మీరు ఇలా చేయకపోతే నేను నిరాశ చెందుతాను’ అని బీకాం విద్యార్థిని కీర్తి శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ఆర్జే కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటనపై గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

News August 19, 2024

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ సస్పెన్షన్

image

AP: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పెద్దఎత్తున తన బంధువులను నియమించి రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాల్లోనూ గోల్‌మాల్ చేశారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

News August 19, 2024

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయండి: బండి

image

TG: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాఫీ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. విలీనం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

News August 19, 2024

రక్షాబంధన్: మగవాళ్లందరూ ఆలోచించాల్సిన విషయం!

image

ఆడకూతుళ్లపై అత్యాచారాలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఇలాంటి కష్టం మన ఆడపడుచుకే వస్తే ఎలా స్పందిస్తాం? తప్పుచేసిన వాడి తోలు ఒలిచేస్తాం. కానీ అలాంటి తప్పు జరిగే ఆస్కారం ఎందుకివ్వాలి? ఈ స్వేచ్ఛాభారతంలో ఆడపిల్లలు స్వతంత్రంగా, నిర్భయంగా తిరిగే సమాజాన్ని నిర్మించుకోలేమా? ప్రతి ఆడకూతురిని మన ఆడపడుచులా భావించి ఓ తోబుట్టువులా రక్షగా నిలవలేమా? ఈ ‘రక్షాబంధన్’కి మగవారందరూ ఆలోచించాల్సిన విషయమిది.

News August 19, 2024

అదానీ కంపెనీల్లో రూ.2000 కోట్లు పెట్టిన MFs

image

అదానీ గ్రూప్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ జులైలో రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మేలో రూ.880 కోట్లు పెట్టిన MFs జూన్‌లో రూ.990 కోట్లకు పెంచాయి. అదానీ 8 కంపెనీల్లో వీటి పెట్టుబడుల మొత్తం విలువ జూన్‌లో 39,227 కోట్లు ఉండగా జులైలో రూ.42,154 కోట్లకు చేరింది. ప్రమోటర్లు రూ.23,000 కోట్ల విలువైన షేర్లు కొనడాన్ని MFs పాజిటివ్‌గా తీసుకున్నాయి. అదానీ పోర్ట్స్‌లో అత్యధికంగా రూ.1100 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.

News August 19, 2024

టీమ్ఇండియాపై ఆల్‌రౌండర్లే కీలకం: కమిన్స్

image

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్లే కీలకమని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. కామెరాన్ గ్రీన్‌ బంతితోనూ ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని అంచనా వేశారు. మిచెల్ మార్ష్‌‌ బౌలింగ్ సేవల్నీ వాడుకుంటామన్నారు. ‘టాప్-6లో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల వల్ల జట్టు కూర్పు సులభం అవుతుంది. వారిద్దరి వల్ల మాకు ఆరు బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇక స్పిన్నర్ లైయన్ ఎన్ని ఓవర్లైనా వేస్తారు’ అని చెప్పారు.