News December 25, 2024

నితీశ్‌ని తప్పిస్తారా.. అర్థరహితం: గవాస్కర్

image

మెల్‌బోర్న్‌లో రేపు జరిగే టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పిస్తారన్న వార్తలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆ నిర్ణయం పూర్తిగా అర్థరహితమని మండిపడ్డారు. ‘నితీశ్‌ను డ్రాప్ చేయలేం. అతడు జట్టుకు నాలుగో బౌలర్. మంచి బ్యాటర్ కూడా. అతడిని తప్పించకూడదు. అదే విధంగా గత మ్యాచ్‌లో ఫాలో ఆన్ గండం తప్పించిన ఆకాశ్ దీప్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కాల్సిందే’ అని తేల్చిచెప్పారు.

Similar News

News January 25, 2025

టీమ్ ఇండియాకు మరో షాక్? స్టార్‌ ఆల్‌రౌండర్‌కి గాయం?

image

ఓపెనర్ అభిషేక్ శర్మ కాలి గాయంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్‌కు దూరమయ్యారు. రింకూ సింగ్ కూడా గాయపడటంతో నేటి, తర్వాతి మ్యాచులు ఆడటం లేదు. వారికి బ్యాకప్‌గా శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

News January 25, 2025

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక

image

సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.

News January 25, 2025

VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్

image

AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.