India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. క్రితం సెషన్లో 80,436 వద్ద ముగిసిన BSE సెన్సెక్స్ నేడు 80,680 వద్ద మొదలైంది. ప్రస్తుతం 110 పాయింట్ల లాభంతో 80,547 వద్ద కొనసాగుతోంది. NSE నిఫ్టీ 54 పాయింట్లు ఎగిసి 24,595 వద్ద చలిస్తోంది. BPCL, శ్రీరామ్ ఫిన్, NTPC, ONGC, హిందాల్కో టాప్ గెయినర్స్. HDFC లైఫ్, M&M, నెస్లే ఇండియా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్ ఎక్కువ నష్టపోయాయి.
రక్షాబంధన్ రోజున తన అన్నయ్య, మాజీ సీఎం జగన్‌కు షర్మిల రాఖీ కడతారా? లేదా? అనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా విడిపోయారు. జగన్‌పై షర్మిల విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ప్రతిసారి అన్నయ్యకు రాఖీ కట్టిన షర్మిల.. 2021 నుంచి దూరంగా ఉన్నారు. మరి ఈసారైనా రాఖీ కడతారా?
ఈ మధ్య కాలంలో చాలా మంది డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకునేందుకు శాకాహారం తినాలని HCU పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. నాన్ వెజిటేరియన్లతో పోలిస్తే శాకాహారుల్లో కుంగుబాటు, ఒత్తిడి తక్కువని పేర్కొన్నారు. వెజిటేరియన్లలో వ్యద్ధ్యాప్యం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్లు, పప్పులు భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని గుర్తించారు.
నరేంద్ర మోదీ పాలనలో రక్షాబంధన్ ‘ట్యాక్స్ బంధన్’గా మారిపోయిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మిఠాయిపై 5%, గిఫ్ట్ హాంపర్లపై 12-18%, లిఫాఫాలపై 12%, జరీ దారంపై 5%, కాటన్ దారంపై 5% జీఎస్టీ విధించారని మండిపడింది. ‘భాయ్ ఔర్ బెహన్’ అంటూనే దోచుకుంటున్నారని విమర్శించింది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ BRS MLC కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 20న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం విచారించనుంది.
TG: సోదరులకు రాఖీ కట్టి ఓ సోదరి తుదిశ్వాస విడిచిన విషాద ఘటన మహబూబాబాద్(D) నర్సింహులపేట(మ)లో జరిగింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమె(17)ను ప్రేమ పేరుతో ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో MHBDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని UPAనే మొదట లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వీరప్ప మొయిలీ (కాంగ్రెస్) సారథ్యంలోని రెండో పరిపాలనా సంస్కరణ కమిషన్ దీనికి గట్టిగా మద్దతిచ్చిందని పేర్కొన్నాయి. పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, సిటిజన్ ఫ్రెండ్లీనెస్ పెంచేందుకు సంస్కరణలు చేపట్టాలని కమిషన్ నొక్కి చెప్పిందన్నాయి. కొన్ని పదవులకు ప్రత్యేక నైపుణ్యాలు, విజ్ఞానం అవసరమే అన్నాయి.
జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని హీరోయిన్ నిత్యామేనన్ అన్నారు. ఇదొక అదృష్టంగా భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అవార్డును ప్రకటించిన తర్వాత నుంచి అభినందనలు తెలిపేందుకు కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. అవార్డు వచ్చాక తాను ఎంపిక చేసుకునే చిత్రాలు, టీమ్ మారవని స్పష్టతనిచ్చారు. ‘తిరుచిత్రంబలం’ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం వరించింది.
AP: ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. టీడీపీ ఆది నుంచి ఆడబిడ్డల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశమే. డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మీకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
TG: సదరన్ డిస్కంలో ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ CM, డిప్యూటీ సీఎం ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వారంలోనే పరిష్కరించిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.