India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరిగేకొద్దీ ఆయన ఇంకా యంగ్‌గా అవుతున్నారంటారు ఫ్యాన్స్. తాజాగా బయటికొచ్చిన చిరు ఫొటోలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్‌లో మెగాస్టార్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీలో చిరు నటించనున్నారు.
క్రిస్మస్‌ను టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుటుంబంతో ఘనంగా జరుపుకొన్నారు. స్వయంగా ఆయనే శాంటా క్లాజ్ గెటప్‌తో కుటుంబీకులకు, బంధువులకు గిఫ్ట్‌లు ఇవ్వడం విశేషం. ఆయన సతీమణి సాక్షి సింగ్ అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ధోనీ ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ పరిస్థితుల్ని గౌరవించడం నేర్చుకోవాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ‘అతడి ఆట దూకుడుగానే ఉంటుంది. కాదనను. కానీ క్రీజులోకి వచ్చిన తొలి అరగంట పాటు పరిస్థితుల్ని, మంచి బంతుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. తను వచ్చేసరికే భారత్ 500 పరుగులు దాటేసి ఉంటే తప్ప ఆరంభంలోనే దూకుడు సరికాదు’ అని అభిప్రాయపడ్డారు.
ఛార్టెడ్ అకౌంటెంట్స్(CA)-నవంబర్ పరీక్షల తుది ఫలితాలను రేపు(26న) సాయంత్రం విడుదల చేయనున్నట్లు ICAI ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <
ఎన్నికల షెడ్యూలు రాకముందే ఢిల్లీ రాజకీయాలు ముదురుపాకాన పడుతున్నాయి. మహిళలకు ₹2100/M, వయోవృద్ధులకు ఉచిత వైద్యం కల్పిస్తామని ఆప్ ప్రకటించింది. మళ్లీ అధికారం చేపట్టాకే ఇస్తామంటూ రిజిస్ట్రేషన్లను ఆరంభించింది. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అవేవీ నిజం కావని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ స్కీములే లేవంటూ పేర్లు, పత్రాలూ ఎవరికీ ఇవ్వొద్దనడం వివాదానికి దారితీసింది.
తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలోని రేపిస్టులు, హంతకులు, నరరూప రాక్షసులకు మరణ శిక్ష పడేలా చూస్తానని US అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరణశిక్ష పడాల్సిన 40మందిలో 37మందికి క్షమాభిక్ష పెట్టానని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ‘నా దేశంలోని కుటుంబాల్ని, పిల్లల్ని కాపాడుకునేందుకు మరణశిక్షల్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయిస్తాను’ అని పేర్కొన్నారు.
ఇటీవల పాత కార్లు, పాప్‌కార్న్‌పైనా జీఎస్టీ పెంచడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఇవాళ క్రిస్మస్ కావడంతో ‘గిఫ్ట్‌లపైనా జీఎస్టీ ఉందా?’ అని శాంటా తాతయ్య ఆన్‌లైన్‌లో వెతుకుతున్న ఫొటో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేస్తున్న నెటిజన్లు ‘ఎందుకుండదు అన్నింటిపైనా జీఎస్టీ ఉంటుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు?
AP: కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. వీరందరితో దాదాపు 15 నిమిషాలపాటు సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జేపీ నడ్డా, అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం.
హీరోయిన్లు కియారా అద్వానీ, అలియా భట్‌తో అనుచితంగా వ్యవహరించారనే ప్రచారంపై బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ స్పందించారు. ఓ ప్రమోషన్ ఈవెంట్లో కియారాను ప్లాన్ ప్రకారమే కిస్ చేశానని పేర్కొన్నారు. మరోవైపు అలియాతో ఫ్రెండ్లీగా ఉంటానని తెలిపారు. ఫన్ కోసమే ఆమెను తాకానని, అందులో దురుద్దేశమేమీ లేదన్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ నుంచే తాము స్నేహితులమన్నారు. వరుణ్ నటించిన ‘బేబి జాన్’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
TG: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలికారు. కాగా ఉపరాష్ట్రపతి మరికాసేపట్లో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ రైతులతో ఆయన సమావేశమవుతారు. ఈ రాత్రికి కన్హా శాంతివనంలో బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
Sorry, no posts matched your criteria.