News December 25, 2024

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

image

TG: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలికారు. కాగా ఉపరాష్ట్రపతి మరికాసేపట్లో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ రైతులతో ఆయన సమావేశమవుతారు. ఈ రాత్రికి కన్హా శాంతివనంలో బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Similar News

News January 24, 2025

విలపించిన సంజూ.. కాపాడిన ద్రవిడ్

image

రాహుల్ ద్రవిడ్ వల్లే సంజూశాంసన్ ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడని అతడి తండ్రి విశ్వనాథ్ అన్నారు. KCA అతడి కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనే కాపాడారని వెల్లడించారు. ‘ఓసారి నా కొడుకుపై KCA యాక్షన్ తీసుకుంది. అతడి కిట్, సామగ్రి లాక్కుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్ కాల్ చేయగానే సంజూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధపడొద్దని చెప్పిన ద్రవిడ్ అతడిని NCAకు తీసుకెళ్లి శిక్షణనిచ్చారు’ అని వివరించారు.

News January 24, 2025

నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు: హీరోయిన్

image

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో <<15056007>>వివాదం<<>> వేళ హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనానికి బాగా స్క్రాచెస్ పడ్డాయి. అయినా వాళ్లు ఆపలేదు. ‘‘పెద్దవాళ్లు’’ నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కాగా తనను చంపాలంటే చంపొచ్చని ఇటీవల మాధవీలత వ్యాఖ్యానించారు.

News January 24, 2025

ఫీజులోనూ ఈ వ్యత్యాసం ఎందుకు?.. విద్యార్థి ఆవేదన

image

పోటీ పరీక్షల్లో రిజర్వేషన్లను దాటుకొని సీటు సాధిస్తే.. ఫీజులోనూ వ్యత్యాసం చూపడం ఏంటని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ MBBS ఫీజు GENకి రూ.14లక్షలు, OBCకి రూ.8లక్షలు, SC/STకి 0, EWS విద్యార్థులకు రూ.7లక్షలు అని ఉంది. తమ తల్లిదండ్రులూ అప్పులు చేసి చదివిస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. ఇక్కడైనా రిజర్వేషన్ తీసేయాలని సూచిస్తున్నారు.