news

News February 22, 2025

బంతులా?.. బుల్లెట్లా?

image

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.

News February 22, 2025

15 ని. ముందే సెంటర్లకు చేరుకోవాలి: APPSC

image

AP: రేపు గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించిన APPSC.. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ఉ.10 గం. నుంచి మ.12.30 గం. వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది.

News February 22, 2025

వీడిన సందిగ్ధం.. ఇక సిద్ధమై సత్తా చాటండి!

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై APPSC తాజా ప్రకటనతో సందిగ్ధం వీడింది. రేపు యథాతథంగా పరీక్షలు జరగనుండగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని ముందుగానే ఎగ్జామ్ సెంటర్లు ఉన్న ఆయా ప్రాంతాలకు చేరుకోండి. మొక్కవోని దీక్ష, ఎన్నో కష్టాలకు ఓర్చి పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులంతా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. భవిష్యత్తుకు మార్గం చూపే చక్కటి అవకాశం కావడంతో ఓర్పు, నేర్పుతో పరీక్ష రాయండి. ALL THE BEST.

News February 22, 2025

ఇదే రికార్డు.. భార్యకు రూ.380 కోట్లు భరణం!

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ సెలబ్రిటీ భరణం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చాహల్ రూ.60 కోట్లు భరణంగా ఇవ్వనున్నారని వార్తలు రాగా ధనశ్రీ ఫ్యామిలీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుస్సేన్‌కు రూ.380 కోట్ల భరణం ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇండియన్ సెలబ్రిటీల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధికమని చెబుతున్నాయి.

News February 22, 2025

SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

image

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 22, 2025

BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.

News February 22, 2025

రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

image

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

News February 22, 2025

హీరో రామ్ పోతినేనితో మంత్రి కందుల భేటీ

image

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ షూటింగ్ సెట్‌లో కలిశారు. రాజమండ్రిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా ‘RAPO22’ మూవీ కోసం రామ్ రాజమండ్రిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ ఆయనను కలిశారు.

News February 22, 2025

రూ.10వేల కోట్లిచ్చినా NEP అమలు చేయం: స్టాలిన్

image

కేంద్రం రూ.10వేల కోట్లు ఇచ్చినా ‘జాతీయ విద్యా విధానాన్ని’ అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. NEPని అమలు చేస్తే రాష్ట్రం 2వేల ఏళ్ల నాటి చారిత్రక యుగం నాటికి వెళుతుందని ఆరోపించారు. కామర్స్, ఆర్ట్స్ వంటి కోర్సులకు నీట్ మాదిరి ప్రవేశపరీక్ష ఉండటం ఏంటని ప్రశ్నించారు. హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రుద్దటాన్నిఅంగీకరించేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.

News February 22, 2025

UPIతో PF విత్‌డ్రా.. మరో 2-3 నెలల్లో..!

image

UPI ద్వారా PF సొమ్మును విత్‌డ్రా చేసుకునే సదుపాయం మరో 2-3 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో EPFO చర్చిస్తోంది. దీని ద్వారా EPF ఉపసంహరణ సులభతరం అవుతుందని, జాప్యం, పనిభారం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఇది అమలైతే UPI లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగినట్లే PF ఖాతా నంబర్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.