India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పైనున్నది సుభాష్ చంద్రబోస్ 1936 Mar 5న ఎమిలీకి రాసిన ప్రేమ లేఖ. అందులో ‘మై డార్లింగ్, టైమ్ వస్తే మంచైనా కరగాల్సిందే. ప్రస్తుతం నా పరిస్థితీ ఇదే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జైలుకు వెళ్లొచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు. ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు. ఉత్తరాలూ రాయలేకపోవచ్చు. కానీ నువ్వెప్పుడూ నా గుండెల్లో ఉంటావు. ఇప్పుడు కాకపోతే మరు జన్మలో కలిసి ఉందాం’ అని ఉంది.
బాలికలు, మహిళలపై పెరిగిన హింసాత్మక ఘటనలను నిరోధించడానికి యూకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొట్టమొదటిసారిగా తీవ్రమైన స్త్రీద్వేషాన్ని తీవ్రవాద రూపంగా పరిగణించాలని యోచిస్తోంది. ఆన్‌లైన్‌లో మహిళలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని హోం సెక్రటరీ కూపర్ అధికారులను ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.
TG: సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట GOVT ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరారు.
ఎమిలీ ఓ భారతీయుడి వద్ద పని చేయడం ఆమె పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయితే బోస్‌ను కలిసిన తర్వాత వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. వీరి వివాహం 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో జరిగింది. వీరికి ఓ కూతురు అనితా బోస్ ఫాఫ్. విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివాహాన్ని వారు చివరి వరకూ రహస్యంగానే ఉంచారు.
సుభాష్ చంద్రబోస్ 1934లో యూరప్‌లో ఉండగా ‘ది ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకం రాయడానికి పూనుకున్నారు. దానికి ఇంగ్లిష్ తెలిసిన ఎమిలీ షెంకెల్(23)ని అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. ఆమె ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తన మనసులో ప్రేమ విత్తనం నాటుతుందని బోస్ ఊహించలేకపోయారు. మొదట బోసే ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పారని బోస్ సోదరుడి మనవడు సుగత్ బోస్ ఓ పుస్తకంలో రాశారు. > నేడు బోస్ వర్ధంతి.
TG: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఉద్యోగి 3 నెలలుగా జీతాలు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని Xలో పోస్టు చేశారు. అతని మరణానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు నచ్చితే లైక్ చేసే సౌలభ్యం ఉంది. వాట్సాప్ స్టేటస్‌లకూ అదే తరహాలో లైక్ ఆప్షన్ తీసుకురానున్నట్లు దాని మాతృసంస్థ మెటా పేర్కొంది. స్టేటస్ కింద కనిపించే హార్ట్ సింబల్ క్లిక్ చేస్తే లైక్ చేసినట్లుగా ఆ స్టేటస్ పెట్టినవారికి తెలుస్తుందని వివరించింది. మెటా ఏఐ వాయిస్‌తో వాట్సాప్‌ను అనుసంధానించి రియల్-టైమ్ AI వాయిస్ చాటింగ్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మెటా తెలిపింది.
ఒక కర్ణాటక CM అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2010లో అప్పటి BJP CM యడియూరప్ప అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు గవర్నర్ HR భరద్వాజ్ విచారణకు ఆమోదించారు. యడ్డీ రాజీనామాకు అప్పటి ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ CM సిద్ద రామయ్యకు భూకుంభకోణం ఆరోపణలతో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ విచారణకు అనుమతిచ్చారు.
సొంత గడ్డపై వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగియగా, సెకండ్ టెస్టులో 40 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144కు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 246 రన్స్ చేసి, మొత్తంగా 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే కరీబియన్ జట్టు 222 స్కోరుకే ఆలౌట్ అయ్యింది.
AP: భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించిన ఉన్మాదులు అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.