news

News August 16, 2024

జమ్మూకశ్మీర్ పరిస్థితి ఇదీ!

image

2014లో చివరిసారి JK అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2018లో PDP-BJP ప్ర‌భుత్వం కూలిపోయింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న అమ‌లులోకి వ‌చ్చింది. 6 నెలల తరువాత రాష్ట్రప‌తి పాల‌న విధించారు. అనంతరం ఆర్టిక‌ల్‌ 370ని కేంద్రం ర‌ద్దు చేసింది. JK, ల‌ద్దాక్ రెండు UTలుగా ఏర్పాటయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థించి Sep30 లోపు ఎన్నిక‌లు నిర్వహించాలంది. దీంతో EC షెడ్యూల్ ప్రకటించింది.

News August 16, 2024

హరియాణాలో ఒకే దశలో పోలింగ్

image

హరియాణాలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 4న ఫలితాల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి వచ్చే నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

News August 16, 2024

మూడు విడతల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు

image

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌లు మూడు విడ‌త‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 19న మొద‌టి విడత, సెప్టెంబ‌ర్ 25న రెండో విడ‌త‌, అక్టోబ‌ర్ 1న మూడో విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, ఇందులో 74 జ‌న‌ర‌ల్‌, 9 ఎస్టీ, 7 ఎస్సీ రిజ‌ర్డ్వ్ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఓట‌ర్లు 87 ల‌క్ష‌లు. 11 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయ‌నున్నారు.

News August 16, 2024

దక్షిణాది సినిమాలే సత్తాచాటాయి

image

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో దక్షిణాది సినిమాలు సత్తాచాటాయి. ఉత్తమ చిత్రం(ఆట్టమ్), ఉత్తమ నటుడు(రిషబ్ శెట్టి), నటి(నిత్యా మేనన్-సంయుక్తంగా) కేటగిరీల్లో సౌత్ మూవీస్‌కే పురస్కారాలు దక్కాయి. గత ఏడాది కూడా ఉత్తమ హీరో(అల్లు అర్జున్) పురస్కారం దక్షిణాది నటుడినే వరించిన సంగతి తెలిసిందే.

News August 16, 2024

CII డీజీతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: అమరావతిలో GLC(గ్లోబల్ లీడర్ షిప్ కాంపిటీటివ్‌నెస్) సెంటర్ ఏర్పాటుపై CII డీజీ చంద్రజిత్ బెనర్జీతో చర్చించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను అమలు చేయడానికి GoAP-CII ఇండస్ట్రీ ఫోరమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి కల్పనపై దృష్టి పెడతామన్నారు.

News August 16, 2024

ALERT: ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు?

image

ఇయర్ ఫోన్స్ అతి వాడకంతో వినికిడిలోపం ఏర్పడే ప్రమాదం ఉందని US ఆస్టియోపతిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇయర్ ఫోన్స్‌ నుంచి 60% సౌండ్ మాత్రమే వినాలని, అది కూడా రోజుకు 60ని.లకు మించవద్దంది. 100% వాల్యూమ్‌తో అయితే 5ని.లకు మించి వాడవద్దని చెబుతోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్, బ్లూటూత్ వంటివి కర్ణభేరికి అతి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల వినికిడి సమస్యలతో పాటు చెవిలోకి ఫంగస్, బాక్టీరియాలు చేరే ప్రమాదం ఉంటుంది.

News August 16, 2024

ఓలా.. అదిరిపోలా: 20% అప్పర్ సర్క్యూట్

image

స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు అదరగొడుతున్నాయి. HSBC బయ్ రేటింగ్ ఇవ్వడంతో నేడు 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. క్రితం సెషన్లో రూ.110 వద్ద ముగిసిన షేర్లు శుక్రవారం రూ.121 వద్ద మొదలయ్యాయి. క్రమంగా పెరిగి రూ.21.18 లాభంతో రూ.133.08 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఐపీవో ధర రూ.76తో పోలిస్తే ప్రస్తుతం 75.11% లాభపడ్డాయి.

News August 16, 2024

స్వర్ణాంధ్రప్రదేశ్-2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌: CM CBN

image

AP: స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో-ఛైర్‌గా ఉంటారని తెలిపారు. ఇందులో మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. చంద్రశేఖరన్‌తో సీఎం తాజాగా భేటీ అయ్యారు. అమరావతిలో CII ఏర్పాటు చేయనున్న GLCలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించిందని తెలిపారు.

News August 16, 2024

బెంగాల్ యంత్రాంగంపై హైకోర్టు మొట్టికాయలు

image

RGకర్ ఆస్పత్రిపై మూకదాడిని ఆపడంలోరాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ప్రాంగణం వద్ద 7000 మంది గుమిగూడారని, బారికేడ్లు దాటుకొని వచ్చారని పోలీసులు చెప్పగా.. ఘటనను ఎందుకు అంచనా వేయలేదని, 144 సెక్షన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఘటన పూర్వాపరాలపై 2 వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని ఆస్పత్రి ఇన్‌ఛార్జ్‌ను ఆదేశించింది. తర్వాతి విచారణకు వైద్య నేతలు రావాలని సూచించింది.

News August 16, 2024

రేపే ‘ప్రభాస్-హను’ మూవీ ప్రారంభం!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమా పూజా కార్యక్రమం రేపు జరగనున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఎల్లుండి నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపాయి. మూడు వారాల పాటు షూటింగ్ కొనసాగుతుందని చెబుతున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. కాగా సలార్-2, కల్కి-2, స్పిరిట్ సినిమాలు స్టార్ట్ చేయాల్సి ఉంది.