news

News August 14, 2024

BREAKING: ఎమ్మెల్సీగా బొత్స!

image

AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎన్నిక దాదాపు ఖరారైంది. స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై రిటర్నింగ్ అధికారి కాసేపట్లో ప్రకటన చేయనున్నారు. ఎన్డీయే కూటమి ఈ ఎన్నిక నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

News August 14, 2024

స్టైలిష్ లుక్‌లో హిట్ మ్యాన్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నారు. బ్లూ కలర్ సూట్‌లో మ్యాన్లీ లుక్స్‌తో ఉన్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఎంతో స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. క్రికెటర్ నుంచి ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా మారుతున్నారా? అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా రిలీజైన ICC మెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో హిట్ మ్యాన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

News August 14, 2024

సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం: రాష్ట్ర‌ప‌తి

image

సామాజిక న్యాయ‌మే ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు. భార‌త 78వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జాతినుద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ‘ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. రైతులు, యువత, మహిళలు, పేదలు అభివృద్ధి చెందిన భారతదేశానికి 4 స్తంభాలుగా ప్రధాని అభివర్ణించారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

News August 14, 2024

ఇలాగైతే ‘హైడ్రా’ కొనసాగేనా?

image

TG: HYDలో చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’పై నీలి నీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. నిన్న అధికార పార్టీ MLA దానం నాగేందర్ దీనికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా MIM పార్టీ నేతలు సైతం ఈ హైడ్రా వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని ఉపసంహరించుకోవాలంటూ GHMC మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

News August 14, 2024

హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్

image

కవలలు పుట్టారన్న సంతోషంలో ఉన్న ఓ తండ్రికి తీరని శోకం మిగిలింది. ఇజ్రాయెల్ చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో గాజా వాసి అబు కుటుంబం మృత్యువాతపడింది. నాలుగు రోజుల క్రితం పుట్టిన అసెర్, ఐసెల్‌ తమ అమ్మ ఒడిలో సేదతీరుతుండగా వారి ఇంటిపై బాంబు పడింది. దీంతో పిల్లలతో పాటు అబు భార్య, తల్లి మరణించారు. ఆ సమయంలో బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన అతడికి విషయం తెలిసి గుండె పగిలింది.

News August 14, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) గుడ్ న్యూస్ చెప్పింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను SCR ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపింది. కౌంటర్ వద్ద ఉంచిన ప్రత్యేక డివైజ్‌లో వచ్చే క్యూఆర్ కోడ్ సాయంతో పేమెంట్ చేసి, టికెట్ పొందవచ్చని వెల్లడించింది. దీనివల్ల చిల్లర సమస్యలు తీరనున్నాయి.

News August 14, 2024

అవసరమైతే నన్ను తిట్టండి: మమతా బెనర్జీ

image

కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటనలో అన్ని చర్యలు తీసుకున్నా తమపై దుష్ప్రచారం జరుగుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అవసరమైతే తనను తిట్టొచ్చని, కానీ బెంగాల్‌ని దూషించొద్దని కోరారు. కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, సీపీఐ బంగ్లాదేశ్ తరహాలో నిరసనలకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.

News August 14, 2024

SBI, PNBలకు కర్ణాటక సర్కార్ షాక్

image

కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. SBI, PNB(పంజాబ్ నేషనల్ బ్యాంక్)లతో అన్ని రకాల లావాదేవీలను సస్పెండ్ చేసింది. ఆయా బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ అకౌంట్లను వెంటనే మూసివేయాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది. ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులు దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News August 14, 2024

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం

image

AP: అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చారు. ‘అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతుండటం శుభపరిణామం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున రూ.కోటి ఇచ్చాను. నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News August 14, 2024

ఫాక్స్‌కాన్ సీఈవోతో మోదీ చర్చలు

image

తైవాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సీఈవో యంగ్ లియు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏఐ, సెమీకండక్టర్, ఫ్యూచరిస్టిక్ రంగాల గురించి ఆయనతో చర్చించారు. ‘భవిష్యత్‌లో ఇతర రంగాల్లో భారతదేశం అందించే అవకాశాలను నేను ఆయనకు వివరించా. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారతదేశంలో వారి పెట్టుబడి ప్రణాళికలపై కూడా మేము చర్చలు జరిపాము’ అని మోదీ ట్వీట్ చేశారు.