India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ICC నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నిర్వహించే టోర్నీ మ్యాచులను ఇండియా తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే పాక్ కూడా ఇండియా నిర్వహించే టోర్నీ మ్యాచులన్నీ తటస్థ వేదికలో ఆడుతుంది. దీంతోపాటు 2024 నుంచి 2027 వరకు జరిగే అన్ని ICC ఈవెంట్స్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది.
AP: కొందరు మంత్రుల వద్ద పెండింగ్ ఫైళ్లు పేరుకుపోతున్నాయంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. ‘మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. వారు టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత సేపు పెండింగ్‌లో ఉంటున్నాయో నాకు తెలుసు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. కిమ్స్ వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరాతీశారు. కాగా నిన్న హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా బాలుడిని పరామర్శించిన విషయం తెలిసిందే. అతడికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు? పేదల ఇళ్లు కూల్చినా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? విధ్వంసకారుడి వికృత ఆలోచనలకు ఈ ప్రభుత్వం ప్రతిరూపం’ అని ట్వీట్ చేశారు. NTR ఘాట్ తొలగించాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.
స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడాయి. ఊహించినట్టుగానే భారీ నష్టాల్లో ముగిశాయి. US FED 25BPS వడ్డీరేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గించకపోవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం. నిఫ్టీ 23,951 (-247), సెన్సెక్స్ 79,218 (-964) వద్ద స్థిరపడ్డాయి. దీంతో మదుపరులు ఏకంగా రూ.5L కోట్ల మేర సంపదను కోల్పోయారు. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BAJAJFINSV, JSWSTEEL, BAJFIN, GRASIM, ASIANPAINT టాప్ లూజర్స్.
TG: మోహన్ బాబు ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రూ.24,276 కోట్లతో పనులు, మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల కేటాయింపు, వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్, పోలవరం ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు, కృషి విజ్ఞాన కేంద్రానికి 50.20 ఎకరాల బదిలీ, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.
*మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్
*22న సెకండ్ లాంగ్వేజ్
*24న ఇంగ్లిష్
*26న మ్యాథ్స్
*28న ఫిజిక్స్
*29న బయోలజీ
*ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్
>>ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆయన తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. దీనికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నా. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో ఆశ్చర్యం వేసింది. అప్పటివరకు నాకు కూడా ఈ విషయం తెలియదు. వీడ్కోలు పలికినందుకు సగం సంతోషం, సగం బాధగా ఉంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు తోపులాట వ్యవహారంలో BJP, కాంగ్రెస్ MPలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని BJP మహిళా MP ఫాంగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. ‘నా గౌరవ మర్యాదలు, సెల్ఫ్ ఎస్టీమ్‌ను రాహుల్ గాంధీ గాయపరిచారు’ అని పేర్కొన్నారు. BJP MPలు తోసేయడం వల్ల సర్జరీ చేయించుకున్న మోకాలికి గాయమైందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.