India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అఫ్గానిస్థాన్‌లో విషాదం నెలకొంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 52మంది మృతిచెందారు. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. గజిని రాష్ట్రంలోని కాబూల్, కాందహార్ హైవేపై బుధవారం ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. షాబాజ్ గ్రామంలో ఫ్యూయల్ ట్యాంకర్, అందార్ జిల్లాలో ట్రక్కును బస్సులు ఢీకొన్నాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అంతర్యుద్ధాలతో సతమతమైన అఫ్గాన్‌లో రోడ్లు అస్సలు బాగుండవు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. డైరెక్టర్ శంకర్‌తో, కీలక పాత్రలో నటిస్తోన్న SJ సూర్యతో చరణ్ ఉన్న ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 10న థియేటర్లు షేక్ అవుతాయంటూ పేర్కొన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
AP: ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అనుమానాస్పద స్థితిలో విశాఖ గాజువాకకు చెందిన ఫణికుమార్(33) చనిపోయిన ఘటనపై మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. చదువు కోసం వెళ్లి మృతి చెందడం బాధాకరమన్నారు. అతని తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫణికుమార్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని లోకేశ్ కోరారు.
రష్యా <<14911189>>క్యాన్సర్<<>> వ్యాక్సిన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని దేశాల ప్రజలు దీనిపై ఆసక్తి కనబరిచారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఇది లేకే తమ మిత్రులు, బంధువులెందరినో కోల్పోయామని ఆవేదన చెందారు. ‘మిత్రదేశమైన భారత్‌కే రష్యా ముందుగా వ్యాక్సిన్లు పంపాలి’ అని భారతీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం గమనార్హం. 2025 Jan నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని తెలిసింది.
అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై CM చంద్రబాబుకు ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని కోరారు. అంబేడ్కర్‌ను అవమానించారని, ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, ప్రధాని మోదీ కూడా ఆయన్ను సమర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.
TG: ధరణిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. ‘మాయలపకీరు చేతిలో చిలకలా ధరణి ఉండేది. మాయల పకీరు చెప్పనిదే సొంత భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి. ధరణితో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. VRA వ్యవస్థను తిరిగి తీసుకురావాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3వ క్వార్టర్‌లో మాంద్యానికి లోనైంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాలకంటే తగ్గడంతో NZ డాలర్ విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ 2024 Sep త్రైమాసికంలో 1% తగ్గింది. ఇది మార్కెట్ అంచనాలైన 0.2% తగ్గుదలకంటే అధికం. అలాగే జూన్ క్వార్టర్ 1.1% క్షీణతతో కలిపితే సాంకేతికంగా మాంద్యాన్ని సూచిస్తుంది. దీంతో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల కోత విధించవచ్చు.
‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ‘ముఫాసాకు గాత్రం అందించడం అద్భుతమైన అనుభవం. ఇది ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. నేను పొందిన ఆనందాన్ని మీరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి మీరు వెళ్తున్నారా? కామెంట్ చేయండి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.710 తగ్గి రూ.77,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,700గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000గా ఉంది.
TG: జానపద కళాకారుడు, ‘బలగం’ మూవీలో నటించిన మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటన్నారు. మొగిలయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొగిలయ్య భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అటు మూవీ డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.