India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేవలం 100 గ్రా. బరువును పరిగణనలోకి తీసుకుని <<13796504>>అనర్హత<<>> వేటు వేయడం సరైంది కాదని CASలో వినేశ్ ఫొగట్ కౌన్సిల్ వాదించింది. ‘అథ్లెట్ మొత్తం బరువులో అది 0.1-0.2% మాత్రమే. దానివల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఒకేరోజు మూడు గేమ్స్‌లో తలపడటంతో అథ్లెట్ ఆరోగ్యం దృష్ట్యా ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. బౌట్స్ మధ్య తక్కువ వ్యవధి ఉండడంతో బరువు తగ్గేందుకు ఛాన్స్ లేకుండా పోయింది’ అని వాదించింది.
ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద చిక్కే వచ్చింది. వక్ఫ్ బిల్లు ఆయన ముందర కాళ్లకు బంధం వేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిల్లును ప్రతిపక్ష కూటమి వ్యతిరేకిస్తే శివసేన UBT ఎంపీలేమో మౌనం వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేసినందుకు ఇలాగే చేస్తారా అంటూ ముస్లిములు తీవ్ర స్వరంతో మాతోశ్రీ ముంగిట ధర్నా చేపట్టారు. బిల్లును వ్యతిరేకిస్తే మహా ఎన్నికల్లో హిందూ ఓట్లకు నష్టం, ఇవ్వకుంటే ముస్లిం ఓట్లు రావన్న భయం.
మనుషులపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వాటికి బయట ఆహారం లభించకపోవడం, మనుషుల నుంచి వాటికి ఆదరణ లేకపోవడం దీనికి కారణమని పెటా ఇండియా, నిపుణుల నివేదికలు చెబుతున్నాయి. కనిపించగానే తరిమికొట్టడం వల్ల అవి ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని పేర్కొన్నాయి. వాహనాలు ఢీకొని కుక్క పిల్ల చనిపోతే వాటి తల్లులు అలాంటి వాహనాల్ని శత్రువులుగా భావిస్తాయని, అందుకే కొన్ని సార్లు బైక్స్ వెంట పడతాయని తెలిపాయి.
TG: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థిని సాహితి(15) హార్ట్ అటాక్‌తో మరణించింది. నిన్న రాత్రి బాలికకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
TG: ఇంటర్ సెకండియర్‌లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు కానున్నాయి. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు పెంచేందుకు బోర్డు గత ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించింది. ఇప్పుడు ఈ విధానాన్ని సెకండియర్‌కు విస్తరించింది. 80 మార్కులు థియరీకి, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనుంది. థియరీ మార్కులు కుదించడంతో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. మోడల్ క్వశ్చన్ పేపర్‌ను ఇంటర్ <
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అపర్ణ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు.
లెబనాన్ నుంచి 30 ప్రొజక్టైల్స్ తమ భూభాగంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని తెలిపింది. హమాస్ సీనియర్ కమాండర్ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లానే ఇలా చేసినట్టు సమాచారం. చిన్నపాటి క్షిపణుల్లా ఉండే ప్రొజక్టైల్స్ అంత శక్తిమంతమైనవి కావు. ఈ దాడులపై US స్పందించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా గైడెడ్ మిసైల్ సబ్ మెరైన్‌ను మోహరించాలని US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు.
బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్ ఆస్ట్రేలియా పార్లమెంటు హౌస్‌లో రేపు ప్రసంగించనున్నారు. ఈ నెల 15న జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకల్లో భాగంగా వారికి ఈ గౌరవం దక్కింది. వివిధ సంస్కృతుల మధ్య సినిమా వారధిగా ఎలా పనిచేస్తుందన్నదానిపై వారు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తమకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నామని వారిద్దరూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
వచ్చే 4 నెలల్లో భారత్ 10 టెస్టులు ఆడనుంది. వీటిలో మొదటిది వచ్చే నెల 19న బంగ్లాదేశ్‌తో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన జాతీయ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ శాతం మందికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు షమీ మళ్లీ జట్టులోకి రావొచ్చని అంచనా వేశాయి.
భారత స్టాక్ మార్కెట్ల విశ్వసనీయతపై <<13830742>>రాహుల్ గాంధీ<<>> అనుమాన బీజాలు నాటుతున్నారని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. మన ఎకానమీపై నమ్మకాన్ని చెడగొట్టేందుకు ఇది ఆయన చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. ఇది భారత్‌ను నాశనం చేయడమేనని చెప్పారు. అదానీ షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచలేదని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టం చేసిందన్నారు. నిబంధనల్ని సెబీ ఉల్లంఘించలేదని CJI చంద్రచూడ్ ధర్మాసనమే చెప్పినట్టు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.