News February 15, 2025

మీనాక్షి నటరాజన్ రాజకీయ ప్రస్థానమిదే

image

TG కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌‌గా నియమితులైన <<15464666>>మీనాక్షి నటరాజన్‌<<>> 1999-2002 NSUI అధ్యక్షురాలిగా, 2002-2005 మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009-2014 వరకు మాందసౌర్ MPగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడారు. 2022లో భూదానోద్యమానికి 75yrs పూర్తయిన సందర్భంగా TGలో పర్యటించారు. 2023 TG అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు.

Similar News

News March 22, 2025

రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

image

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.

News March 22, 2025

టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

image

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.

News March 22, 2025

IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

image

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

error: Content is protected !!