India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రస్తుతం కొంత మంది పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, మాట్లాడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడితే ఇలా జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన రవీంద్ర-సుజాత దంపతుల కుమారుడు ఈ వ్యాధితోనే బాధపడుతున్నాడు. దీంతో ఇలాంటి పిల్లల కోసం థానేలో వీరిద్దరూ ఆశ్రమం స్థాపించారు. తల్లిదండ్రుల బాధను అర్థంచేసుకొని ఇక్కడ విద్య, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందిస్తున్న ఈ జంటను అభినందించాల్సిందే.

ఇంగ్లండ్ జట్టు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కుమారుడు డిలాన్ పీటర్సన్‌కు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన వన్డే జెర్సీని బహుమతిగా ఇచ్చారు. జెర్సీపై ఆటోగ్రాఫ్‌తో పాటు ‘టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్’ అని రాసి ఇచ్చారు. ‘ఇంటికొచ్చి కోహ్లీ జెర్సీని డిలాన్‌కు ఇచ్చా. ఇది పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. థాంక్స్ బడ్డీ’ అని కెవిన్ తన కొడుకు ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

AP: విశాఖ జిల్లా గోపాలపట్నంలో విషాదం చోటు చేసుకుంది. భర్త కామవాంఛకు భార్య బలైంది. నాగేంద్ర, వసంతకు 11 నెలల క్రితం పెళ్లైంది. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర అందులో ఉన్నట్లే చేయాలని భార్యను తరచూ ఒత్తిడి చేసేవాడని, దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెగా టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు రూ.20.8 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.4 కోట్లు ఇవ్వనుంది. అలాగే సెమీఫైనల్ చేరిన జట్లకు చెరో రూ.5.26 కోట్లు అందజేస్తుంది. మొత్తం రూ.60 కోట్ల ప్రైజ్ మనీని అన్ని జట్లకు ఇవ్వనుంది. ఈ నెల 19 నుంచి మెగా లీగ్ ప్రారంభం కానుంది. 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

నేడు వాలంటైన్స్ డే. ఈరోజు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రేమికులు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటుంటారు. కానీ, కొందరు చిన్న గొడవలకే విడిపోతూ వచ్చే ప్రేమికుల రోజున మరొకరికి ఇదే వాగ్దానాన్ని రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిలబడే ప్రేమలకంటే అవసరం తీరాక మొహం చాటేసే ప్రేమలే ఎక్కువైపోయాయని లవ్ ఫెయిల్యూర్స్ Xలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భాగస్వామిలో ప్రేమను వెతుక్కోవడం బెటర్ అంటున్నారు. మీరేమంటారు?

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టైన నలుగురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. 5రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వుల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. 18 వరకు వీరిని విచారించనున్నారు. AR డెయిరీ MD రాజశేఖరన్, భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవి డెయిరీ CEO వినయ్‌కాంత్ ఈ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

అమెరికా నుంచి ప్రధాని నరేంద్రమోదీ తిరుగు పయనమవ్వడంతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ నెల 17/18న BJP లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఇక 19/20న కొత్త CM ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లతో అధిష్ఠానం జాబితా సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, HM అమిత్ షా కలిసి మోదీతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేస్తారు.

బ్యూటీపార్లర్ నడుపుకునే హీరో ఓ కేసులో చిక్కుకోవడం, బయటపడేందుకు ఏం చేశాడనేదే ‘లైలా’ స్టోరీ. విశ్వక్‌సేన్ లేడీ గెటప్, అక్కడక్కడా కామెడీ సీన్లు కొంత వరకు ఫర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ సక్సెస్ కాలేకపోయారు. సెంటిమెంట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా మెప్పించలేకపోయాయి.
RATING: 1.75/5

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.

ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్ రాకతో ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన ట్రోఫీని పాటిదార్ సారథ్యంలో దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాగా RCBకి ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లుగా (ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, వాట్సన్, డుప్లెసిస్) చేశారు. వారిలో ఏ ఒక్కరు ఆ జట్టుకు కప్‌ను అందించలేకపోయారు.
Sorry, no posts matched your criteria.