News February 14, 2025

విరాట్ జెర్సీలో కెవిన్ పీటర్సన్ కొడుకు!

image

ఇంగ్లండ్ జట్టు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కుమారుడు డిలాన్ పీటర్సన్‌కు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన వన్డే జెర్సీని బహుమతిగా ఇచ్చారు. జెర్సీపై ఆటోగ్రాఫ్‌తో పాటు ‘టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్’ అని రాసి ఇచ్చారు. ‘ఇంటికొచ్చి కోహ్లీ జెర్సీని డిలాన్‌కు ఇచ్చా. ఇది పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. థాంక్స్ బడ్డీ’ అని కెవిన్ తన కొడుకు ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Similar News

News March 22, 2025

IPL: రేపు హైదరాబాద్‌లో మ్యాచ్

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ రేపు HYD ఉప్పల్ వేదికగా జరగనుంది. హోం టీమ్ సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఆదివారం మ.3.30 గంటల నుంచి క్రీడాభిమానులను అలరించేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మ్యాచ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 19 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.

News March 22, 2025

BIG BREAKING: మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

image

TG: కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలుచాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. కోళ్ల ఫుడ్, వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.

News March 22, 2025

IPL 2025: విజేత ఎవరో?

image

మెగావేలం తర్వాత జరిగే ఈ సీజన్‌లో 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మరి ఈ సీజన్‌లో కింది విభాగాల్లో ఎవరు సత్తా చాటుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
* సీజన్ విజేత
* రన్నరప్
* ఆరెంజ్ క్యాప్
* పర్పుల్ క్యాప్
* అత్యధిక సిక్సర్లు
* అత్యధిక శతకాలు
* అత్యధిక పరుగులు
* అత్యధిక వికెట్లు

error: Content is protected !!