India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తాను అధికారం కోల్పోవడానికి, బంగ్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ‘నేను సెయింట్ మార్టిన్, బంగాళాఖాతాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే అధికారంలో కొనసాగేదాణ్ని’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అవామీ లీగ్ పార్టీ నేతలకు హసీనా సందేశం పంపినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి తెలుగు యువతనూ విపరీతంగా ఆకట్టుకున్న <<13086302>>‘ప్రేమలు’<<>> మూవీ TV ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 18న సా.5.30 గంటలకు జీతెలుగులో ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని ఫహాద్ ఫాజిల్ నిర్మించగా, గిరీశ్ దర్శకత్వం వహించారు. మమితా బైజు, అఖిలా భార్గవన్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, గఫూర్ కీలక పాత్రలు పోషించారు. కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసింది.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. గోపాల్‌గంజ్‌లో ఆర్మీ వాహనానికి మూకలు నిప్పంటించిన విషయం ఆలస్యంగా తెలిసింది. షేక్ హసీనా తిరిగి రావాలని వేలమంది అవామీ లీగ్ సపోర్టర్స్ ఢాకా-ఖుల్నా హైవేను బ్లాక్ చేశారు. ఆదేశించినప్పటికీ వారు రోడ్డు ఖాళీ చేయకపోవడంతో ఆర్మీ అధికారులు లాఠీలు ఉపయోగించారు. దీంతో వారు వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయని సమాచారం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ‘మట్కా కింగ్’ వాసు అనే పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. రిపోర్టులో పేర్కొన్న వ్యక్తులతో తమకెలాంటి వాణిజ్య సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తాము పారదర్శకత, చట్టానికి కట్టుబడి ఉన్నామంది. వ్యక్తిగతంగా లాభపడేందుకే ఓ కల్పిత రిపోర్టును రూపొందించారని విమర్శించింది. వారి ఆరోపణలు అవాస్తవమని సుప్రీం కోర్టు ప్రకటించిందని తెలిపింది. భారత చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ షార్ట్‌సెల్లర్ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.
ఇండియాలో సామాన్యులు కట్టే పన్నులకు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సేవలకు పొంతన లేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం, వస్తువులు, సేవలు, ఇన్సూరెన్స్, టోల్.. ఇలా పుట్టినప్పటి నుంచి మరణించేవరకు పన్నులు కడుతూనే ఉన్నామని గుర్తు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, రోడ్లు, రైల్వే లాంటి మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడట్లేదంటున్నారు. దీనిపై మీ కామెంట్?
*స్త్రీల గుండె పురుషుల గుండె కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది.
*పిగ్మీ ష్రూ అనే జీవికి అత్యధికంగా నిమిషానికి 1200 సార్లు హృదయస్పందన ఉంటుంది.
*నవ్వడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
*ఫెయిరీ ప్లై అనే కీటకం అతి చిన్న గుండె, నీలి తిమింగలం అతిపెద్ద గుండెను కలిగి ఉంటాయి.
AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ <<13788692>>ఉప ఎన్నిక<<>>లో పోటీపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తగినంత మంది సభ్యుల బలం లేనందున పోటీ చేయకపోవడం మంచిదని సీనియర్లు, కచ్చితంగా చేయాల్సిందేనని మరికొందరు నేతలు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వినేశ్ ఫొగట్‌కు జపాన్ రెజ్లర్ రీ హిగుచి అండగా నిలిచారు. ‘నీ బాధను నా కన్నా ఇంకెవరూ బాగా అర్థం చేసుకోలేరు. నీలాగే 50Gr అధిక బరువుతో డిస్‌క్వాలిఫై అయ్యాను. నీ చుట్టూ ఉన్నవాళ్ల మాటలు పట్టించుకోకు. ఎదురుదెబ్బల నుంచి పుంజుకోవడం ఓ అందమైన అనుభవం’ అని ఆయన ట్వీట్ చేశారు. హిగుచి 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్. సొంతగడ్డపై టోక్యో ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అయ్యారు. పారిస్‌లో స్వర్ణం గెలిచారు.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్ని ఆస్పత్రుల్లో కొన్ని ఎంపిక చేసిన సేవలను నిలిపేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(FORDA) తెలిపింది. అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలో వైద్యురాలి <<13822185>>హత్యాచార <<>>ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాకు లేఖ రాసింది. నిందితుడిని శిక్షించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని కోరింది.
Sorry, no posts matched your criteria.