News February 14, 2025
గురుకుల విద్యార్థులకు చికెన్ బంద్

AP: రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్ స్కూళ్లలో విద్యార్థులకు చికెన్ నిలిపేస్తున్నట్లు గురుకులాల సెక్రటరీ సదా భార్గవి తెలిపారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చికెన్ బదులుగా పండ్లు, స్వీట్లు, వెజ్ కర్రీ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చికెన్ పెట్టకూడదని ఆమె అధికారులను ఆదేశించారు.
Similar News
News March 23, 2025
కష్టాల్లో ముంబై.. 6 వికెట్లు డౌన్

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ ముగిసే సరికి 6వికెట్లు కోల్పోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా సాగుతోంది. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు ముంబై కష్టపడుతోంది. నూర్ 3, ఖలీల్ 2 వికెట్లు తీశారు. రోహిత్(0), రికెల్టన్(13), జాక్స్(11), సూర్య(29), తిలక్ వర్మ(31), రాబిన్(3) ఔటయ్యారు. 13 ఓవర్లకు MI స్కోర్ 96/6గా ఉంది.
News March 23, 2025
ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.
News March 23, 2025
రాష్ట్రంలో 8 మంది మృతి

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.