India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్ని ఆస్పత్రుల్లో కొన్ని ఎంపిక చేసిన సేవలను నిలిపేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(FORDA) తెలిపింది. అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలో వైద్యురాలి <<13822185>>హత్యాచార <<>>ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాకు లేఖ రాసింది. నిందితుడిని శిక్షించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని కోరింది.
అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తొలగించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. JPC ద్వారానే స్కామ్‌ను పూర్తిగా దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. అంతిమ ప్రయోజనం పొందే ఫారిన్ ఫండ్స్ యజమాని ఎవరో తెలిపే ప్రక్రియను సెబీ 2019లో రద్దు చేయడాన్ని SC కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. పార్లమెంటును రెండ్రోజుల ముందే నిరవధిక వాయిదా ఎందుకేశారో ఇప్పుడు అర్థమవుతోందని సెటైర్ వేసింది.
స్నేహితులతో గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న 13 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో జరిగింది. ఫీల్డింగ్ చేస్తూ బంతి కోసం వెళ్లిన బాలుడు గ్రౌండ్ చివరన ఓ విద్యుత్ స్తంభాన్ని తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవలే ఇలాంటి 2 ఘటనలు జరిగాయి. దీంతో NHRC ఢిల్లీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.
AP: హోంమంత్రి వంగలపూడి అనితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమె మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
AP: రేషన్ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీలర్ నుంచి బియ్యం, సరుకులు తెచ్చుకోవాలంటే క్యూలో ఇక కుస్తీ చేయాల్సిందే. వృద్ధులు, దివ్యాంగులకు మళ్లీ నరకం చూపెట్టేందుకు సిద్ధమవుతున్నావా చంద్రబాబు?’ అని ప్రశ్నించింది.
మధుమేహం చికిత్స కోసం తయారు చేస్తున్న బీజీఆర్-34 అనే ఔషధంలో CSIR పరిశోధకులు గుర్మార్ అనే మొక్కను ఉపయోగిస్తున్నారు. బిహార్‌లోని గయాలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై దీనిని గుర్తించారు. దీనికి మధుమేహాన్ని తగ్గించే లక్షణం ఉంది. ఈ మొక్కలో ఉండే జిమ్నెమిక్ యాసిడ్ తీపి పదార్థాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది. బ్రహ్మయొని పర్వతంపై ఉన్న ఇతర మొక్కల ఔషధ గుణాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
డెస్క్ టాప్ సిస్టమ్స్‌లో Google Chrome వాడే వారికి CERT-in హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌లో లోపాలున్నాయని, వాటిని వాడుకుని సిస్టమ్స్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసే ఛాన్సుందని తెలిపింది. క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్స్ వంటి కీలక సమాచారం తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. విండోస్, మ్యాక్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
2021-22 టూర్‌లో సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలవకపోవడమే తన కోచింగ్‌లో లోయెస్ట్ పాయింట్ అని టీమ్‌ఇండియా మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ తెలిపారు. ‘మేము తొలి టెస్ట్ గెలిచాం. తర్వాత రెండు మ్యాచులు ఓడాం. కొంత మంది సీనియర్ ప్లేయర్లు లేరు. రోహిత్‌కు గాయమై దూరమయ్యాడు. మూడో టెస్ట్ గెలిచేవాళ్లం. కానీ SA బ్యాటర్లు బాగా ఆడి ఛేజ్ చేశారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది.
ప్రేమానురాగాలు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయనే దానికి ఇది నిదర్శనం. ఒడిశాలోని కియోంజర్ అభయారణ్యంలో వయసు సంబంధిత వ్యాధులతో ఓ ఆడ ఏనుగు చనిపోయింది. దీంతో పిల్ల ఏనుగు తల్లి చుట్టూ తిరుగుతూ తొండంతో తడుతూ లేపేందుకు ప్రయత్నించింది. గంటల తరబడి అక్కడే ఉండి కన్నీరు పెట్టుకుంది. ఇక తల్లి లేవదని అర్థం చేసుకుని దు:ఖంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన ఫొటోలు నెటిజన్లను కదిలిస్తున్నాయి.
అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఆసక్తి చూపిందని తెలంగాణ సీఎంవో తెలిపింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అమెరికాలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్‌తో భేటీ అయ్యారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ విస్తరణకు చర్చలు విజయవంతం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.