news

News December 17, 2024

ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. అసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. JNTUలో క్రెడిట్ స్కోర్ 25%, ఓయూలో 50% ఉంటే ప్రమోట్ చేస్తున్నారని అక్బరుద్దీన్ అన్నారు. రెండు వర్సిటీల్లో వేర్వేరు విధానం ఉండటంతో దీనిపై కాలేజీ యాజమాన్యాలతో సమావేశమవుతామని మంత్రి తెలిపారు.

News December 17, 2024

జమిలి బిల్లుపై BJP వ్యూహం: ఓటింగ్ or జేపీసీ?

image

‘జమిలి బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ వ్యూహంపై ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ విప్‌లు జారీచేయడంతో చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంఖ్యా బలం, రాష్ట్ర అసెంబ్లీల మద్దతు అవసరం కావడంతో ప్రభుత్వం JPCకి పంపొచ్చని కొందరి అంచనా. అసలు బిల్లును ఎలా డ్రాఫ్ట్ చేశారో, ఏయే అంశాలను చేర్చారో తెలిస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరి వాదన. మీరేమంటారు?

News December 17, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 62,112 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నారు.

News December 17, 2024

జమిలి బిల్లు: లోక్‌సభలో ఎవరి బలం ఎంత?

image

జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో లోక్‌సభలో పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యాబలమే కీలకం. 543 స్థానాలున్న LSలో NDAకు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో BJP 240, TDP 16, JDU 12, SS 7, LJP 5 పెద్దపార్టీలు. INDIAకు 249 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 99, SP 37, TMC 28, DMK 22 పెద్ద పార్టీలు. కూటమిని TMC పట్టించుకోవడం లేదు. ఇక తటస్థ పార్టీల వద్ద 11 సీట్లున్నాయి.

News December 17, 2024

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య

image

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సన్నిధానం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతుడిది కర్ణాటకలోని రామనగరగా గుర్తించారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

News December 17, 2024

STOCK MARKETS: ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై నష్టాల్లోకి జారుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. నిన్న EU, US సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నేడు నిక్కీ, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో మొదలైనప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ 39PTS పతనమవ్వడం ప్రతికూలతను సూచిస్తోంది. నిఫ్టీ సపోర్టు 24,640, రెసిస్టెన్సీ 24760 వద్ద ఉన్నాయి. USD/INR వీక్‌గా ఉంది. ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

News December 17, 2024

నేటి నుంచి అంగన్వాడీలో ఆధార్ క్యాంపులు

image

AP: నేటి నుంచి 20వరకు, ఈ నెల 26-28 వరకు రాష్ట్ర‌వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకే ఆధార్ కార్డుల జారీ ఉండనుంది. రాష్ట్రంలో 0-6ఏళ్ల వయసు గల పిల్లల్లో 11లక్షల మంది వరకు ఆధార్ నమోదు చేసుకోలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోని పిల్లలకు ఆధార్ లేదని స్పష్టం చేసింది. ఆధార్ క్యాంపుల కోసం కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 17, 2024

రెండు రోజుల బిడ్డ మృతదేహాన్ని డొనేట్ చేశారు!

image

చనిపోయిన తమ రెండు రోజుల కూతురి మృతదేహాన్ని తల్లిదండ్రులు మెడికల్ స్టడీస్ కోసం డొనేట్ చేసిన ఘటన డెహ్రాడూన్‌లో జరిగింది. హరిద్వార్‌కు చెందిన రామ్ మెహర్, నాన్సీ దంపతులకు మెదడు, శ్వాస సంబంధిత సమస్యలతో కూతురు జన్మించింది. ఆ శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచగా మృతిచెందింది. దీంతో డూన్ మెడికల్ కాలేజీకి బాడీని డొనేట్ చేశారు. ఇంత తక్కువ వయసున్న మృతదేహాన్ని దానం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు.

News December 17, 2024

అల్లు అర్జున్‌ రిమాండ్‌కు కారణమిదే?

image

సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకి సెలబ్రిటీలను రానివ్వొద్దని థియేటర్ యాజమాన్యాన్ని ముందే హెచ్చరించినట్లున్న లేఖ <<14898794>>వైరల్<<>> అవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం యాజమాన్యం, అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసుల తరఫు లాయర్ వాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మాత్రం ఈ కారణాన్ని తోసిపుచ్చుతూ అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

News December 17, 2024

భారీగా పడిపోయిన ఎండు మిర్చి ధర

image

TG: ఎండు మిర్చి ధర క్వింటాకు రూ.7వేల వరకు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది ఇదే నెలలో క్వింటా ఎండు మిర్చి గరిష్ఠంగా రూ.23వేలు పలకగా, ప్రస్తుతం రూ.12వేల నుంచి రూ.16వేలు పలుకుతోంది. విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గడమే ధరల తగ్గింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, WGL, NZB, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మిర్చి అత్యధికంగా సాగవుతున్న సంగతి తెలిసిందే.