News February 12, 2025
అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?

ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్‌కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్‌లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.
Similar News
News March 19, 2025
10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.
News March 19, 2025
BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.