India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్ నాణ్యంగా లేవని USA స్కేట్‌బోర్డర్ నైజా హస్టన్ ఆరోపించారు. జులై 29న జరిగిన పురుషుల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ ఫైనల్‌లో అథ్లెట్ హస్టన్ కాంస్య పతకాన్ని గెలిచారు. అయితే, వారం రోజుల్లోనే పతకం పాతదైపోయి రంగు మారిందని ఆయన ఫొటోను పంచుకున్నారు. ఈ మెడల్ యుద్ధానికి వెళ్లి తిరిగివచ్చినట్లు కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. నాణ్యతపై దృష్టిసారించాలని ఆయన కోరారు.
ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా 35 మెడికల్ కాలేజీల్లో 6,210 MBBS, 1,540 BDS సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 16 సా.6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, 3 విడతల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని NTR హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. అన్ని కాలేజీల్లో EWS కోటా అమలు చేస్తామని, అక్టోబర్ 1 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. సీట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని సూచించారు.
TG: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 11న జరగనుంది. హనుమకొండలోని JNS ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ఉంటుందని మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 15న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా వరంగల్‌లోనే జరగడం విశేషం.
ఇయర్ ఫోన్స్, స్పీకర్లు, భారీ శబ్దాల కారణంగా కోట్లాదిమంది వినికిడి శక్తిని కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 12-35 ఏళ్ల మధ్యవయసున్న వారిలో 100 కోట్ల మందికి 2050 నాటికి వినికిడి లోపాలు తలెత్తుతాయని అందులో స్పష్టం చేసింది. భారీ శబ్దాల కారణంగా శాశ్వతంగా వినికిడి కోల్పోతే దానికి పూర్తి చికిత్స లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 WC విజయం అనంతరం స్వదేశానికి చేరుకున్న తర్వాత సిరాజ్ సీఎం రేవంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. సిరాజ్‌ను అభినందించిన సీఎం, అతనికి ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
చంటిబిడ్డకు తల్లిపాలే అమృతం. ఒకవేళ తల్లికి డయాబెటిస్ ఉంటే షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటేనే పాలివ్వాలంటున్నారు వైద్య నిపుణులు. తల్లికి షుగర్ ఎక్కువగా ఉంటే ఆ పాలు తాగిన బిడ్డలో చక్కెర స్థాయుల్ని నియంత్రించేందుకు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల చక్కెర స్థాయి పడిపోయే హైపోగ్లైసీమియా బిడ్డలో తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు వేయడాన్ని సచిన్ టెండూల్కర్ తప్పుబట్టారు. సందర్భాలను బట్టి క్రీడల్లోని నియమాలను పునః పరిశీలించుకోవాలన్నారు. ‘వినేశ్ నిజాయితీగా ఆడారు. కానీ బరువు ఎక్కువ ఉందని తాను గెలిచిన సిల్వర్ మెడల్‌ను ఇవ్వకపోవడం సరికాదు. డ్రగ్స్ వినియోగం వంటి నైతిక ఉల్లంఘనలు చేస్తే ఇలా చేయొచ్చు. ఫొగట్ సిల్వర్ మెడల్‌కు అర్హురాలే. COA ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూద్దాం’ అని ట్వీట్ చేశారు.
విడాకుల అనంతరం నాగచైతన్య ఎంతో బాధపడ్డారని అతని తండ్రి నాగార్జున చెప్పారు. చైతూ-శోభితా <<13805492>>నిశ్చితార్థంతో<<>> ప్రస్తుతం తాము సంతోషంగా ఉన్నామన్నారు. ఈ వేడుకపై ఓ ఇంగ్లిష్ వెబ్‌సైటుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘విడాకుల అనంతరం బాధను చైతూ ఎవరితోనూ పంచుకోలేదు. నా కుమారుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. పెళ్లికి సమయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.
ఆటల వల్ల చాలామంది ప్రపంచానికి పరిచయమవుతారు. కొందరి వల్ల ఆటలే ప్రపంచానికి పరిచయమవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీరజ్. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే వరకు మనలో చాలా మందికి జావెలిన్ త్రో పరిచయం లేదనేది కాదనలేని వాస్తవం. అలాంటిది ఈ ఆటలో బ్రాంజ్, సిల్వర్ మన స్థాయి కాదనే అంచనాలు క్రియేట్ చేశారు. పారిస్‌లోనూ బెస్ట్ ఇచ్చారు. ఇంతకీ జావెలిన్ త్రోలో మీకు నీరజ్ కాకుండా ఎవరైనా తెలుసా?
Sorry, no posts matched your criteria.