News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
Similar News
News March 22, 2025
MLAకి రూ.2 లక్షలు చెల్లించండి: విశాఖ కోర్టు

పలాస MLA గౌతు శిరీషకు రూ.2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
News March 22, 2025
ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
News March 22, 2025
నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <