India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1971లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసి అప్పటి తూర్పు పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరోజును ‘విజయ్ దివస్’గా భారత్ ఏటా గుర్తుచేసుకుంటోంది. ఈరోజు PM మోదీ చెప్పిన శుభాకాంక్షల్ని బంగ్లాలోని యూనస్ సన్నిహితులు తప్పుబట్టారు. తాము చేసిన పోరాటంలో భారత్ ఏదో కొద్దిగా సాయం చేసిందని, నేడు భారత్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. వీరిలో యూనస్ సలహాదారు నజ్రుల్ కూడా ఉన్నారు.
తమిళనాట కార్తీక దీపం వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోయంబత్తూర్‌లోని ఇషా యోగా ఫౌండేషన్‌లో భక్తులు లక్ష దీపాలను వెలిగించారు. ఈక్రమంలో ఆ ప్రాంగణమంతా దివ్యజ్యోతులతో ధగధగలాడింది. ఆదియోగి రూపాన్ని చూస్తూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేశారు.
ఇండోర్ (MP)లో భిక్షాటనపై ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే ఈ నిబంధనల ప్రకారం భిక్షాటన చేస్తున్న వాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై కూడా FIR నమోదు చేయనున్నారు. యాచించే వారు లేని నగరంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ముఠాలు అమాయక ప్రజల్ని యాచకులుగా మారుస్తున్నాయని చెప్పారు. ఇలాంటి రూల్ మన దగ్గరా వస్తే ఎలా ఉంటుంది?
దేశ రాజధానిలో ‘నిర్భయ’పై ఘోరం జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకడు జైల్లో చనిపోయాడు. మరో నలుగురికి ఉరి అమలైంది. ఇక మిగిలిన ఆ ఆరో వ్యక్తి అప్పటికి మైనర్(17). మూడేళ్ల పాటు బాలల కారాగారంలో ఉన్నాడు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థ దక్షిణాది రాష్ట్రాలకు పంపించింది. ప్రస్తుతం ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భద్రత దృష్ట్యా అతడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
మద్యమే అన్నింటికీ పరిష్కారం అన్నట్లుగా తాగేస్తుంటారు. కానీ మద్యపానం దీర్ఘకాలిక నిద్ర సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఆల్కహాల్ లైంగిక సామర్థ్యంతో పాటు టెస్టోస్టెరాన్ స్థాయుల్ని తగ్గిస్తుందని సూచించారు. డ్రంక్&డ్రైవ్ చేస్తే ఎదురొచ్చే వాహనాలను జడ్జ్ చేయలేమని, రంగు & చూపు మందగిస్తుందని తద్వారా ప్రమాదాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.
అవిశ్వాస తీర్మానంలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో Feb 23న ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయ స్థిరత్వం కోసం షోల్జ్ ఈ ఓటమిని స్వయంగా కోరుకోవడం గమనార్హం. Novలో 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కూలడంతో విపక్షాల మద్దతుతోనే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రాజకీయ దిశను ఇప్పుడు ఓటర్లే నిర్ణయిస్తారని షోల్జ్ పేర్కొన్నారు.
జార్జియాలోని గుడౌరిలో ఉన్న ప్రముఖ స్కీ రిసార్టులో విషవాయువులు లీకై 11 మంది భారతీయులు మృతి చెందారు. భారతీయ రెస్టారెంట్ ఉన్న భవనంలోని రెండో అంతస్తులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్‌బాడీలపై ఎటువంటి గాయాలు లేవని తేలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత పవర్ జనరేటర్‌ను ఆన్ చేయడం వల్ల విడుదలైన విషవాయువుల (కార్బన్ మోనాక్సైడ్) కారణంగా మరణాలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.
AP: రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ, 42 ఎకరాల్లో హైకోర్టు భవనాలను నిర్మిస్తామన్నారు. వచ్చే సోమవారం నాటికి టెండర్లను పిలిచే కార్యక్రమం ప్రారంభించి, జనవరి ఆఖరిలోగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వివరించారు.
పుష్ప-2 దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ పెట్టిన 5 వారాల డీల్ ప్రకారం జనవరి 8 లేదా 9న స్ట్రీమ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే రూ.1,400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
TG: గ్రూప్-2 పరీక్షల్లో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమేంటని హరీశ్ రావు ఫైరయ్యారు. ‘చంద్రబాబు, రాయపాటి, లగడపాటి, సుబ్బరామిరెడ్డి, కావూరిలపై ప్రశ్నలు చూస్తే టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగక మానదు. మలి తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే?’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.