India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలు దానం చేసి పేరెంట్స్ నలుగురి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. మన్యం(D) కొత్తవలసకు చెందిన సాయికుమార్(22) బైక్‌పై ఇంటికొస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడిని VZM ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను విశాఖకు తరలించి నలుగురికి అమర్చారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.
AP: సీఎం చంద్రబాబుకు YCP నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సూపర్-6 హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. వీటిని అమలు చేయాలంటే రూ.కోట్లు కావాలనే సంగతి అప్పుడు మీకు తెలియదా? అని నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి ప్రసాదం, రెడ్‌బుక్, SM పోస్టింగులపై చర్యలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయని పేర్కొన్నారు.
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్‌కు వచ్చేస్తారు’ అని తెలిపారు.
DL రిజిస్ట్రేషన్ గల BS-6 సొంత వాహనాలు, అత్యవసర సరుకు రవాణా కమర్షియల్ వాహనాలనే నగరంలోకి అనుమతిస్తారు. 6-9, 11వ తరగతులకూ <<14615373>>ఆన్లైన్ క్లాసులే<<>> ఉండాలని ప్రభుత్వం ప్రకటించే అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు 50% స్టాఫ్‌నే పిలవాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ, కూల్చివేత పనుల నిషేధం. కాలుష్యం ఇంకా తీవ్రమైతే అన్ని విద్యాసంస్థలూ మూసేయడంతో పాటు అత్యవసర వాహనాలే తిరిగాలనే ఆంక్షలొస్తాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సాయం చేశారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ తమన్ తన ఇన్‌స్టా స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీంతో పలువురు ఆయన సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి.
AP: వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా <<14608443>>లోకేశ్<<>> చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్.. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను’ అని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌పైన పెట్టాలని, వారిని అరెస్టు చేయాలని అంబటి పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.