news

News August 9, 2024

Home Loan: ఇది కూడా తీసుకోండి

image

హోం లోన్ తీసుకొనే ప్ర‌తి వ్య‌క్తి త‌ప్ప‌నిస‌రిగా ఇన్సూరెన్స్ తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. పాల‌సీ తీసుకుంటే లోన్ మొత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి రుణాన్ని నెల‌నెలా తిరిగి చెల్లించే ప్రక్రియలో రుణగ్ర‌హీత‌ అకస్మాత్తుగా మరణిస్తే ఆ రుణ‌భారం కుటుంబ స‌భ్యుల‌పై ప‌డ‌కుండా బీమా సంస్థ‌లు మిగిలిన రుణం మొత్తాన్ని బ్యాంకుల‌కు క‌ట్టేలా పాలసీ కాపాడుతుంది.

News August 9, 2024

పవన్ కళ్యాణ్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం

image

ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హీరో స్మగ్లింగ్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ‘పుష్ప’ మాత్రమే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుష్ప అనేది పాత్ర మాత్రమేనని, బన్నీ నిజ జీవితంలో ఎప్పుడూ బాధ్యతగానే ఉన్నారని వారు చెబుతున్నారు. పవన్ పుష్పను ఉద్దేశించి అనలేదంటూ ఆయన ఫ్యాన్స్ వారికి కౌంటర్ ఇస్తున్నారు.

News August 9, 2024

మనీశ్ సిసోడియాకు బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదని పాస్‌పోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆయన జైలులో ఉన్నారు.

News August 9, 2024

స్పెషల్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

image

కల్మషం లేని నవ్వు వారి సొంతం.. ఎవరికీ హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం. పచ్చని చెట్లను ప్రేమిస్తూ.. వన్య ప్రాణులను లాలిస్తూ.. అడవితల్లి ఒడిలో సేదదీరుతారు. మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే వనరులు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పెరుగుతున్న ప్రపంచీకరణతో వారి సంస్కృతి దెబ్బతింటోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 9న UNO ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

News August 9, 2024

హాకీని ఆదుకున్నది ఆ రాష్ట్రమే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత హాకీ జట్టు తిరిగి పునర్వైభవం దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లను మట్టికరిపించి ఔరా అనిపించింది. హాకీకి ప్రాముఖ్యత తగ్గినప్పుడు 2018లో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ముందుకొచ్చి స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్లేయర్లకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులు అందజేసింది. దీంతో భారత హాకీ జట్టు తిరిగి గాడిన పడటమే కాకుండా పతకాలు అందుకుంటోంది.

News August 9, 2024

పెళ్లైన గంటల్లోనే నవదంపతుల మృతి

image

పెళ్లైన గంటల్లోనే ఓ ప్రేమ జంట మరణించింది. ఈ ఘటన కర్ణాటకలో ఉన్న KGFలోని చంబరసనహళ్లిలో జరిగింది. నవీన్ (26), లిఖిత (22)లు ప్రేమ వివాహం చేసుకుని అదే రోజు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఓ గదిలోకి వెళ్లి వాగ్వాదం చేసుకున్నారు. ఆగ్రహంతో లిఖితపై నవీన్ కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే యువకుడితో లిఖిత వాట్సాప్ చాట్ చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

News August 9, 2024

వైసీపీ ల‌క్ష్యం అదేనా?

image

APలో మైనారిటీల ప్రాబ‌ల్యం ఉన్న 20 చోట్ల గత ఎన్నికల్లో YCP ఓట‌మిపాలైంది. అయితే వారిని మ‌ళ్లీ త‌న‌వైపు తిప్పుకోవ‌డానికే వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకించిన‌ట్టు తెలుస్తోంది. సీమ‌లోని 17 చోట్ల సహా 20 స్థానాల్లో మైనార్టీలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వారిని మెప్పించడానికి ఈ బిల్లుపై MIM లేవ‌నెత్తిన అభ్యంతారాల‌తో ఏకీభ‌విస్తూ YCP వ్య‌తిరేకించింద‌న్న‌ది విశ్లేష‌కులు అభిప్రాయం.

News August 9, 2024

‘జన్మభూమి’ అంటే ఏంటో తెలుసా?

image

AP: ఉమ్మడి ఏపీలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు. జన్మభూమిలో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రవాసులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చేశారు. ఇప్పుడు జన్మభూమి 2 కింద అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని CM చంద్రబాబు చెప్పారు.

News August 9, 2024

Stock Market: లాభాల‌తో ప్రారంభం

image

దేశీ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం లాభాల‌తో ప్రారంభ‌మయ్యాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్ల లాభాల‌తో నేడు ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడంతో మాంద్యం భ‌యాలు ఇక త‌గ్గిన‌ట్లే అని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అయితే, నిరుద్యోగం పెరుగుద‌లతో మార్కెట్లు స్థిరంగా పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

News August 9, 2024

8 మ్యాచుల్లో 10 గోల్స్.. కెప్టెన్ అదుర్స్

image

భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్‌లో అన్నీ తానై ముందుండి నడిపించారు. మొత్తం 8 మ్యాచుల్లో 10 గోల్స్ చేశారు. కీలకమైన క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్‌లోనూ గోల్ చొప్పున నమోదు చేశారు. ఇక కాంస్య పతకాన్ని డిసైడ్ చేసే మ్యాచులో రెచ్చిపోయి రెండు గోల్స్ కొట్టారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌గా అదరగొట్టారని ఆయన ప్రదర్శన తరాల పాటు గుర్తుండిపోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.