News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత

TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Similar News
News March 28, 2025
విషాదం: విషమిచ్చిన తల్లి.. ముగ్గురు పిల్లల మృతి!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు బిడ్డలకు నిన్న రాత్రి పెరుగన్నంలో విషం కలిపి తినిపించి అనంతరం తానూ తీసుకుంది. ఉదయం భర్త వచ్చేసరికి ముగ్గురు బిడ్డలు సాయి కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) విగతజీవులుగా కనిపించారు. తల్లిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News March 28, 2025
అంచనాలే సన్‌రైజర్స్ కొంపముంచాయా?

IPLలో SRHపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తుండటంతో SRH ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ 300 రన్స్ గురించే చర్చ నడుస్తోంది. ఆ రికార్డు సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమన్న అంచనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి ఉండొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన అదే జట్టు, నిన్న అతి కష్టంగా 190 రన్స్ చేసిందని గుర్తుచేస్తున్నారు.
News March 28, 2025
హైకోర్టుల్లో 62 లక్షల పెండింగ్ కేసులు!

వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారిపై కోర్టులో విచారణ పూర్తిచేసేందుకు ఏళ్లు పడుతోంది. ఇందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. 2024 చివరి నాటికి సుప్రీంకోర్టులో 82,000, వివిధ హైకోర్టులలో 62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 25 హైకోర్టుల్లో 1,122 మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే ప్రస్తుతం 750 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.