India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇన్‌స్టా వాడే పిల్లలు, టీనేజర్ల కోసం ‘మెటా’ ఇండియాలో టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. ఇందులో పిల్లలకు అసభ్యకర పోస్టులు, సెన్సిటివ్ కంటెంట్ కనిపించకుండా, అధునాతన సెక్యూరిటీతో ప్రైవసీ ఉంటుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కఠినమైన ప్రైవసీ సెట్టింగ్స్, కంటెంట్ గోప్యతా సెట్టింగ్‌లు, కంటెంట్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. 16ఏళ్లలోపు వారు ఈ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉంటే అది టీన్ ఖాతాలోకి మారిపోతుంది.

హైదరాబాద్‌లో ఉంటోన్న ఉద్యోగులను అడగండి రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో. అలాంటిది ఉద్యోగం కోసం రోజూ 700 కి.మీలు ప్రయాణిస్తోందో మహిళ. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో పనిచేస్తున్నారు. పెనాంగ్‌లో నివాసముంటుండగా వారంలో 5 రోజులు విమానంలో ఆఫీసుకెళ్తుంటుంది. ఉదయం 4గంటలకే లేచి ఆఫీసుకు వెళ్తానని ఆమె చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.