India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మీడియా ప్రతినిధిపై దాడి విషయంలో మోహన్‌బాబు స్టేట్మెంట్ పోలీసుల వద్ద ఇంకా నమోదుకానట్లు తెలుస్తోంది. కుటుంబీకులు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వారు తెలిపారని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో గన్ అప్పగిస్తానని మోహన్ బాబు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆయన కోసం కుటుంబీకుల్ని సంప్రదించినట్లు పేర్కొన్నాయి. మరో 2రోజుల్లో MB అందుబాటులోకి రావొచ్చని వివరించాయి.
TG: వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్, టీపీసీసీ చీఫ్ మహేశ్, GHMC పరిధిలోని పార్టీ నేతలు హాజరుకానున్నారు. విజయమే లక్ష్యంగా ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతివ్వడంతో పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తోపాటు లగచర్ల ఘటన కేసుల్లోనూ ఆయనకు నోటీసులు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఆ తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటారని సమాచారం.
వేధింపులు తాళలేక <<14841721>>ఆత్మహత్య<<>> చేసుకున్న అతుల్ సుభాష్ భార్య నికిత, అత్త నిశా, బావమరిది అనురాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య, ఆమె పుట్టింటి వారు తనను వేధిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం అతుల్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులోనే వారిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.
100 రోజుల క్రితం మొదలైన బిగ్‌బాస్ సీజన్-8 నేటితో ముగియనుంది. నేడే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకుల్లో విజేత ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. అవినాశ్, ప్రేరణ, నిఖిల్, నబీల్, గౌతమ్ ఫైనలిస్టులుగా ఉన్నారు. కాగా.. గత ఏడాది ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు విజేత కావొచ్చో కామెంట్స్‌లో తెలపండి.
TG: అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో వస్తున్న విమర్శలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తొక్కిసలాటలో మహిళ మృతికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన మహిళ గురించి బీఆర్ఎస్ ఎందుకు చర్చించడం లేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ కుటుంబంతో CM రేవంత్‌కు బంధుత్వం ఉందని, అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రేట్ రూ.200 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి నాటికి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధర కొండెక్కుతోంది. కొద్దిరోజుల వరకు ఒక్క గుడ్డు ధర 6 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం అది రూ.7.50కి చేరింది. మరి మీ ప్రాంతంలో చికెన్, ఎగ్ రేట్లు ఎలా ఉన్నాయి?
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 117 క్యాచులు అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ (115) రికార్డును ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో రాహుల్ ద్రవిడ్ (210) ఉన్నారు. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ (135) కొనసాగుతున్నారు. కాగా మూడో టెస్టులో విరాట్ 2 క్యాచులు అందుకున్నారు.
హెడ్, సిరాజ్ వివాదంలో ఆస్ట్రేలియా ప్రేక్షకుల ప్రవర్తనపై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆస్ట్రేలియాలోని ‘శాంతిపరులు’ అందరూ సిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లెవరైనా చేసి ఉంటే ఇదే జనం వాళ్లకు జేజేలు కొట్టి ఉండేవారు. ఆస్ట్రేలియన్లు ఒకప్పటిలా వీధికుక్కల్లా రెచ్చిపోవాలని ఆ దేశ మీడియా అంటోంది. మరి ఆ వీధికుక్కలు మొరుగుతాయా?’ అని ప్రశ్నించారు.
TG: రేపు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రిమండలి భేటీలో బిల్లుకు ఆమోదముద్ర వేస్తారని సమాచారం. ఇప్పటికే ముసాయిదాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు పంచాయితీరాజ్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.