India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడ్లు తింటే ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతుంటారు. అందుకోసం ఒకేసారి ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేసి ఇంట్లో స్టోర్ చేస్తుంటారు. అయితే, ఎగ్స్ 10-12 రోజుల వరకే ఫ్రెష్‌గా ఉంటాయని, ఫ్రిడ్జిలో పెడితే 4 వారాల వరకు పాడవవని FSSAI చెబుతోంది. పగిలిపోయిన గుడ్లలో బాక్టీరియా చేరుతుందని, అవి తినొద్దని తెలిపింది. ఫ్రెష్ గుడ్డు నీటిలో తేలియాడదు. పాడైతే పచ్చ సొన గట్టిగా ఉండకుండా లిక్విడ్‌లా మారిపోతుంది.
శ్రీలంకతో చివరి వన్డేలో భారత్ 110 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 249 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన IND 138 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ 35, సుందర్ 30, కోహ్లీ 20, పరాగ్ 15 రన్స్ మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో వెల్లలగే 5 వికెట్లతో చెలరేగారు. ఈ ఓటమితో భారత్ 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. కాగా 27 ఏళ్ల తర్వాత లంకపై భారత్ సిరీస్‌ను మిస్ చేసుకుంది.
TG: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15న CM రేవంత్ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. భద్రాద్రి(D) దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 15న ప్రారంభం కానుండటంతో ఈ నెల 11న మంత్రి సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సమంత, సోనాక్షి సిన్హా, విక్కీ కౌశల్, తాప్సీ, హేమ మాలిని ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా మహేశ్‌బాబు X వేదికగా స్పందించారు. ‘నేటి ఫలితాన్ని పట్టించుకోవద్దు ఫొగట్. మీరు నిజమైన ఛాంపియన్ అని నిరూపించారు. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
AP: కొన్నేళ్ల క్రితం తాను చెప్పినట్లుగా చేనేత వస్త్రాలే <<13799309>>ధరిస్తున్నట్లు <<>>డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఈ రంగంపై జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ రంగానికి అండగా ఉంటాం. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే.. నేతన్నలకు ధీమా కలుగుతుంది’ అని పవన్ వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా కొకైన్ కొనుగోలుకు యత్నించిన ఆసీస్ హాకీ ప్లేయర్ క్రైగ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ 17 ఏళ్ల కుర్రాడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ కూడా ధ్రువీకరించింది. కాగా నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఆసీస్ 2-0 తేడాతో ఓడిపోయింది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన IND 82 రన్స్‌కే 6 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ 35, కోహ్లీ 20, శ్రేయస్ 8, గిల్ 6, పంత్ 6, అక్షర్ 2 పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో పరాగ్, దూబే ఉన్నారు. 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టై కాగా రెండో వన్డేలో లంక విజయం సాధించింది. సిరీస్ సమం కావాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి.
ఫైనాన్స్ బిల్లు-2024కు 45 సవరణలతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి LTCGలో 2 ఆప్షన్స్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఇండెక్సేషన్‌తో కూడిన 20శాతం లేదా 12.5శాతం పన్నును ఎంచుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
AP: విశాఖపట్నం GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 10కి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం ఆగస్టు 30న జరిగే స్థానిక సంస్థల MLC ఎన్నికలపై పడే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 15 మందితో బంగ్లా కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. రిజర్వేషన్లపై రగడ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.