News February 10, 2025
జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

YCP అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 6కు వాయిదా పడింది. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరఫు లాయర్లు సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2025
RCBతో మ్యాచ్.. CSK స్టార్ ప్లేయర్ దూరం!

కాసేపట్లో ఆర్సీబీతో జరిగే కీలకమైన మ్యాచ్‌కు కూడా CSK స్టార్ బౌలర్ మతీషా పతిరణ దూరమయ్యారు. గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించారు. MIతో మ్యాచ్‌లో ఆడిన జట్టును కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేలంలో రూ.13 కోట్లకు పతిరణను CSK సొంతం చేసుకుంది. గాయంతో తొలి మ్యాచ్‌కు అతను దూరమవగా రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ భావించారు.
News March 28, 2025
మిడ్ డే మీల్‌కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్‌హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 28, 2025
మతం విషయంలో నా తల్లిదండ్రులకు సమస్య రాలేదు: సల్మాన్ ఖాన్

తన తల్లిదండ్రుల వివాహంలో హిందూ-ముస్లిం అనే తేడా ఎప్పుడూ రాలేదని సల్మాన్ ఖాన్ అన్నారు. వారికి వృత్తిపరమైన సమస్య తప్ప వేరే ఏది ఉండేది కాదని పేర్కొన్నారు. సికందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్, సుశీల 1964లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సల్మా ఖాన్‌గా సుశీల పేరు మార్చుకున్నారు.