news

News February 9, 2025

గిల్ ఉంటే రో‘హిట్’

image

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్‌తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.

News February 9, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

image

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్, ఆశిష్ సూద్‌తో వీరు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా సీఎం ఎంపికలో రచించిన వ్యూహాన్ని అనుసరించే అవకాశమున్నట్లు సమాచారం.

News February 9, 2025

శర్వానంద్ మూవీకి పవన్ కళ్యాణ్ టైటిల్?

image

శర్వానంద్ హీరోగా ‘SHARWA36’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జానీ’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపిస్తారని సమాచారం. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. కాగా జానీ మూవీ 2003లో విడుదలై అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

News February 9, 2025

ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా మోదీ దగ్గరికే వస్తున్నారు: కిషన్ రెడ్డి

image

TG: అమెరికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంటే ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం మన దేశ ప్రధానిని అభ్యర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించిందని, మిగిలింది తెలంగాణేనని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

News February 9, 2025

2 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేల్లో భారత జట్టు 14 పరుగుల తేడాలో రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ గిల్ 60 పరుగులు చేసి వెనుదిరగగా కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యారు. 21 ఓవర్లకు భారత్ స్కోరు 158/2. క్రీజులో రోహిత్(82*), అయ్యర్(6*) ఉన్నారు. విజయానికి ఇంకా 147 పరుగులు చేయాల్సి ఉంది.

News February 9, 2025

కోతి చేష్టలతో లంకలో చీకట్లు

image

ఓ కోతి నిర్వాకం వల్ల శ్రీలంకలో చీకట్లు అలుముకున్నాయి. సౌత్ కొలంబో ప్రాంతంలోని మెయిన్ పవర్ గ్రిడ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన తీగలపై ఓ కోతి వేలాడటంతో అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో కొలంబో నగరవ్యాప్తంగా కొన్ని గంటలపాటు కరెంటు సరఫరా కాలేదు. కొన్ని ప్రాంతాల్లో 5-6 గంటలపాటు కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

News February 9, 2025

PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

image

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి జిమ్‌లో ఉన్న ఫొటోను మరో హీరో వరుణ్ తేజ్ పంచుకున్నారు. జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC16లో బిజీగా ఉండగా ‘సంబరాల ఏటి గట్టు’తో సాయి ధరమ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 9, 2025

ఫ్లడ్ లైట్‌ ఫెయిల్యూర్‌తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

image

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

News February 9, 2025

క్రమశిక్షణ తప్పినవారిని ఉపేక్షించం: తుమ్మల

image

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజామోదం ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News February 9, 2025

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు

image

*షాహిద్ అఫ్రిదీ- 351 సిక్సర్లు (369 ఇన్నింగ్సులు)
*రోహిత్ శర్మ- 334 (259)
*క్రిస్ గేల్- 331 (294)
*జయసూర్య- 270 (433)
*ధోనీ- 229 (297)
*మోర్గాన్- 220 (230)
*డివిలియర్స్- 204 (218)
*మెక్‌కల్లమ్- 200 (228)
*సచిన్- 195 (452)