News February 9, 2025
కోతి చేష్టలతో లంకలో చీకట్లు

ఓ కోతి నిర్వాకం వల్ల శ్రీలంకలో చీకట్లు అలుముకున్నాయి. సౌత్ కొలంబో ప్రాంతంలోని మెయిన్ పవర్ గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన తీగలపై ఓ కోతి వేలాడటంతో అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో కొలంబో నగరవ్యాప్తంగా కొన్ని గంటలపాటు కరెంటు సరఫరా కాలేదు. కొన్ని ప్రాంతాల్లో 5-6 గంటలపాటు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Similar News
News February 10, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News February 10, 2026
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News February 10, 2026
ఏపీలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు: కేంద్రం

AP: రాష్ట్రంలోని బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ హరీశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ డబ్బును అసలైన యజమానులకు లేదా వారి వారసులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. <<18520571>>‘మీ సొమ్ము- మీ హక్కు’<<>> కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 34వేల ఖాతాలకు చెందిన రూ.161 కోట్లను సెటిల్ చేశామని చెప్పారు.


