news

News April 18, 2025

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

image

బెంగాల్ BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(60) పార్టీ కార్యకర్త రింకూ ముజుందార్(51)ను పెళ్లాడారు. ఇప్పటివరకు బ్రహ్మచారిగానే ఉన్న అతను తన తల్లి చివరి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రింకూకు ఇది రెండో వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్ సందర్భంగా 2021లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌లో IPL మ్యాచ్ చూడటానికి వెళ్లి పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారు.

News April 18, 2025

రేపు జాగ్రత్త: ఎండలు, పిడుగులతో వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు విభిన్న వాతావరణం ఉంటుందని APSDMA వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, <>73 మండలాల్లో వడగాలులు<<>> ప్రభావం చూపే ఛాన్స్ ఉందంది. అల్లూరి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూ.గో. రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 18, 2025

‘ప్యారడైజ్’ తర్వాత సుజీత్‌తో సినిమా: నాని

image

డైరెక్టర్ సుజీత్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని, ఇప్పటికే కథ ఓకే అయ్యిందని హీరో నాని వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పూర్తయ్యాక వచ్చే ఏడాది సుజీత్‌తో మూవీ ఉంటుందన్నారు. అది భారీ బడ్జెట్‌ ప్రాజెక్టు అని, వేరే లెవెల్‌ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

News April 18, 2025

4 రోజుల వేట.. 800 CCTVల స్కాన్.. నిందితుడి అరెస్ట్

image

ఢిల్లీలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న <<16113128>>ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి<<>> పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 బృందాలు 4 రోజులపాటు వేట సాగించి, 800 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి అతడిని పట్టుకున్నారు. నిందితుడి పేరు దీపక్ అని, బిహార్ ముజఫర్‌నగర్ వాసి అని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో 5 నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.

News April 18, 2025

IPL: టాస్ గెలిచిన పంజాబ్

image

చిన్నస్వామి స్టేడియంలో వర్షం తెరిపినివ్వడంతో ఎట్టకేలకు టాస్ పడింది. PBKS కెప్టెన్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. 9.45కి మ్యాచ్ మొదలుకానుంది. ఇరు జట్లూ చెరో 14 ఓవర్లు ఆడతాయి.
RCB: సాల్ట్, కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్‌వుడ్, దయాళ్, సుయాశ్
PBKS: ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, స్టొయినిస్, శశాంక్, జాన్సెన్, బ్రార్, చాహల్, బార్ట్లెట్, అర్షదీప్

News April 18, 2025

అమెరికాలో తెలుగమ్మాయి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల వి.దీప్తి మరణించారు. ఈనెల 12న టెక్సాస్‌లోని ఇంటి ముందు తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా దీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీప్తి నార్త్ టెక్సాస్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు.

News April 18, 2025

4 వారాల ఫారిన్ టూర్‌కు ప్రభాస్?

image

రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇచ్చినట్లు సమాచారం. తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఓ పల్లెటూరుకు డార్లింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు వారాలపాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. తిరిగొచ్చాక పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసి కొత్త సినిమాలపై ఫోకస్ చేస్తారని టాక్.

News April 18, 2025

రేవంత్.. మీ బాస్‌ల కేసుపై మౌనమెందుకు?: KTR

image

TG: నేషనల్ హెరాల్డ్ కేసుపై CM రేవంత్‌ ఎందుకు స్పందించడం లేదని BRS నేత KTR ప్రశ్నించారు. ‘ఓవైపు కాంగ్రెస్ నేతలంతా వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే రేవంత్ మాత్రం తన బాస్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో మౌనమెందుకు పాటిస్తున్నారు? నాకొక్కడికే ఇది తేడాగా అనిపిస్తోందా?’ అని Xలో సెటైర్ వేశారు. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్‌ పేర్లను ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే.

News April 18, 2025

IPL: ఆ టీమ్‌కు కెప్టెన్ దూరం?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ ఆ మ్యాచ్‌లో పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్కాన్స్ తీయించామని, రేపు LSGతో మ్యాచ్‌కు ఆడటం అనుమానమేనని RR వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి పరాగ్ కెప్టెన్సీ చేసే అవకాశముంది.

News April 18, 2025

కాలేయ ఆరోగ్యం: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

image

శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్‌దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం

error: Content is protected !!