India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BNP లీడర్ ఖలీదా జియా 1991-1996, 2001-2006 మధ్య బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భారత వ్యతిరేక భావాలతో జియా బంగ్లాలో ఇన్నాళ్లు రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో షేక్ హసీనాకు భారత్ సహకరించి బంగ్లా ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ భారత్ బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చింది BNP. అధికార దుర్వినియోగం, ఇతర కేసులతో జియా 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఆమెను రిలీజ్ చేస్తూ ప్రెసిడెంట్ తాజాగా ఆర్డర్స్ ఇచ్చారు.
తెలంగాణలో ఖాళీ అవనున్న 3 MLC స్థానాల ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 29తో కరీంనగర్, మెదక్, NZB, ADB జిల్లాల పట్టభద్రుల MLC, ఇవే జిల్లాల ఉపాధ్యాయ MLC, నల్లగొండ, KMM, వరంగల్ జిల్లాల టీచర్స్ నియోజకవర్గ MLCల పదవీకాలం ముగియనుంది. SEP నుంచి ఓటరు జాబితా దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 30 తుది జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
బంగ్లాదేశ్ ప్రధాని, ఆవామీ పార్టీ అధినేత షేక్ హసీనా దేశం విడిచిపెట్టినప్పటికీ అక్కడి ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆమె పార్టీ నేతలకు చెందిన ఇళ్లను, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మోర్తజా ఇంటిపై దాడి చేసి తగులబెట్టారు. మోర్తజా ఆవామీ పార్టీ తరఫున నరైల్-2 నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. మరో క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిపైనా దాడి జరిగినట్లు సమాచారం.
AP: ప్రతి గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఉపాధి హామీపై 13,326 పంచాయతీల్లో త్వరలో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ రోడ్ల మరమ్మతులతోపాటు 4,721KMల మేర రహదారులను నిర్మిస్తామని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. 5.40 కోట్ల కుళాయి కలెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
TG: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీ-శాట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీ-శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్‌లో నేటి నుంచి అక్టోబర్ 19 వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. తిరిగి అవే ఎపిసోడ్స్ విద్య ఛానల్‌లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు టెలికాస్ట్ చేస్తామన్నారు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఈ సినిమాలో నటించాలని మీకు ఆఫర్ వచ్చిందా?’ అని హీరో విక్రమ్‌ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. రాజమౌళి, తాను అప్పుడప్పుడూ మాట్లాడుకుంటామని, భవిష్యత్తులో కలిసి సినిమా చేయాలనుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మాట్లాడుకోలేదని తంగలాన్ మూవీ ప్రమోషన్లలో తెలిపారు.
AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ <<13783949>>హైకోర్టుకు<<>> వెళ్లడంతో అధికారులు స్పందించారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్‌కు అలాగే ఇచ్చామన్నారు.
TG: రాష్ట్రంలో 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. ఈ పరీక్షకు 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా 2,45,263 మంది హాజరయ్యారు. హాజరు శాతం 87.61గా నమోదైంది. త్వరలోనే కీ విడుదల కానుంది. సెప్టెంబర్ 5కల్లా నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో 12 దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 14న సేవలు ప్రారంభం కానుండగా నేటి నుంచే బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సీఈవో ఎల్బర్స్ తెలిపారు. ఏ231 నియో విమానాల్లో మూడు వరుసల్లో 4 చొప్పున 12 బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఈ విమానాల్లో 208 ఎకానమీ సీట్లతో కలిపి మొత్తం 220 సీట్లు ఉండనున్నాయి.
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్‌లో ఈ ఆప్షన్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
Sorry, no posts matched your criteria.